AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP SSC Supplementary exam: AP 10th సప్లిమెంటరీతో విద్యార్థులకు మరో ఛాన్స్! పరీక్షలు ఎప్పుడు తెలుసా..?

AP SSC 10th Class Supplementary exam date: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. 85 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మిగితావారు కొన్ని కొన్ని సబ్జె్క్టుల్లో ఫెయిలయ్యారు. ఈ క్రమంలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల తేదీలను విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.

AP SSC Supplementary exam: AP 10th సప్లిమెంటరీతో విద్యార్థులకు మరో ఛాన్స్! పరీక్షలు ఎప్పుడు తెలుసా..?
Ap 10th Class Supplementary Exams Date
Rajashekher G
|

Updated on: Apr 30, 2026 | 12:05 PM

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం పదో తరగతి పరీక్షల ఫలితాలు కాసేపటి క్రితమే విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 80 శాతానికిపైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మిగితా వారు కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు. దీంతో వారి కోసం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా విద్యాఖ అధికారులు ప్రకటించారు.

మే 25 నుంచి..

ఏపీలో టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన్ 4 వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. పరీక్ష ఫీజు మే 1 నుంచి 9 వరకు చెల్లించుకోవచ్చని తెలిపింది. రూ.50 లేట్ ఫీజుతో మే 25 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే రీకౌంటింగ్‌కు (సబ్జెక్టుకు రూ.500), రీ వెరిఫికేషన్‌కు (సబ్జెక్టుకు రూ.1,000) మే 1 నుంచి 7 వరకు అప్లై చేసుకోవచ్చని పేర్కొంది.

85 శాతం ఉత్తీర్ణత..

ఇక పదో తరగతి ఫలితాలను ఏపీలో గురువారం విడుదల చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫలితాలను ప్రకటించారు. ఈసారి మొత్తం 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 87.90 శాతంతో బాలుర (82.68 శాతం) కంటే మెరుగైన ఫలితాలు సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 78.39 శాతం ఉత్తీర్ణత నమోదవగా, గత ఏడాది ఇది 72.8 శాతంగా ఉంది.

ఏపీ టెన్త్ ఫలితాలు ఇక్కడ చూసుకోండి

Follow Us