AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pragathi : ఆ ఒక్క పాట వల్లే హీరోయిన్‏గా సినిమాలు చేయడం మానేశా.. టాలీవుడ్ నటి ప్రగతి..

టాలీవుడ్ నటి ప్రగతి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రగతి మాట్లాడుతూ తన కెరీర్, ఆర్థిక సవాళ్లతో పాటు ఆత్మగౌరవం గురించి వెల్లడించారు. అలాగే ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన తాను సహయ నటిగా ఎందుకు మారాల్సి వచ్చింది అనే విషయాలను వెల్లడించారు.

Pragathi : ఆ ఒక్క పాట వల్లే హీరోయిన్‏గా సినిమాలు చేయడం మానేశా.. టాలీవుడ్ నటి ప్రగతి..
Pragathi
Rajitha Chanti
|

Updated on: Aug 13, 2026 | 11:54 AM

Share

ప్రముఖ నటి ప్రగతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితం గురించి పంచుకున్నారు. ఆమె తన ఆర్థిక స్థితిగతులు, వృత్తిపట్ల ఆమెకున్న నిబద్ధత, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి తీసుకున్న కఠిన నిర్ణయాల గురించి వివరించారు. “నాకు పీఆర్ ఉంటే, నాది ఇంకా ఇంత సైలెంట్ గా ఎందుకుంటది?” అంటూ తనకు పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) టీమ్ లేదని ప్రగతి స్పష్టం చేశారు. ఒక పీఆర్ టీమ్‌ను పెట్టుకునేంత స్తోమత తనకు లేదని, ఇది ఇతరుల విషయంలో తనకు తెలియదని అన్నారు. సినిమాలే తన ఏకైక ఆదాయ వనరు అని, తనకు ఆర్థిక సమస్యలు లేవని చెప్పడం అబద్ధమని ఆమె అన్నారు. “ఐ డోంట్ హావ్ అ బ్యాకప్ వేర్ ఐ కెన్ సిట్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కూర్చుని పర్లేదు పని వచ్చినప్పుడు చూసుకుందాం అనేంత కంఫర్ట్ జోన్ లో అయితే నేను లేను” అని ప్రగతి పేర్కొన్నారు. అందరిలాగే తాను కూడా అప్పులు చేసుకుంటూ, ఆస్తులు రొటేట్ చేసుకుంటూ జీవితాన్ని నడుపుతున్నానని తెలిపారు. గత ఒకటిన్నర, రెండు సంవత్సరాలు పని లేనప్పుడు ఈ రొటేషన్ పద్ధతిలోనే తన కుటుంబ ఖర్చులను నిర్వహించినట్లు ఆమె వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నాం.. అప్పుడే విడిపోవాలని అనుకున్నాం.. టాలీవుడ్ నటి..

పవర్ లిఫ్టింగ్ :

పవర్ లిఫ్టింగ్‌లో పాల్గొనడం వల్ల ఆర్థికంగా ఏమైనా లాభం వచ్చిందా అన్న ప్రశ్నకు “ఏమీ ఉండదండి. అస్సలు ఎదురు కట్నం ఇచ్చుకోవాలి, మనమే ఖర్చు పెట్టుకోవాలి, మనమే చేయాలి” అని ప్రగతి సమాధానమిచ్చారు. ఇది డబ్బు సంపాదించడానికి కాదని, తన అభిరుచిని తీర్చుకోవడానికి మాత్రమే అని ఆమె స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Hemachandra: నేను చేసిన మొదటి తప్పు అదే.. వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. సింగర్ హేమచంద్ర..

వర్షం పాట సంఘటన:

తన కెరీర్‌లో ఒక వర్షం పాట కారణంగా హీరోయిన్‌గా నటించడం మానేశానని ప్రగతి వెల్లడించారు. “నేను హీరోయిన్‌గా చేసినప్పుడు థట్ వాజ్ ద లాస్ట్ మూవీ నేను హీరోయిన్‌గా చేసింది” అని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా సెట్‌లో ఒక వ్యక్తి తనతో మాట్లాడిన విధానం నచ్చకపోవడంతో, “అసలు వీడెవడు వీడు నాతోటి ఇలా మాట్లాడటం ఏంటి అసలు ఇన్ని మాటలు పడి నేను ఎందుకు చేయాలి” అని భావించి, ఆ సినిమా తర్వాత “నేను ఇంక మీదట యాక్ట్ చేయను” అని చెప్పి మానేసి వెళ్లిపోయానని తెలిపారు. ప్రగతి ఆత్మగౌరవం చాలా ఎక్కువ అని, అదే తనకు సమస్యగా మారిందని అన్నారు. “నేను తప్పు చేయలేదు నేను ఎందుకు… తీసుకోను” అని ఆమె చెప్పారు. తాను చాలా ఆచితూచి మాట్లాడతానని, ఎవరి జోలికీ వెళ్లనని, అబద్ధాలు ఆడనని, నిజాయితీగా ఉంటానని ప్రగతి పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood: ఆ సినిమాను ఆ హీరో తప్ప మరెవరు చేయలేరు.. అందుకే నేను రిజెక్ట్ చేశా.. నటుడు సుమంత్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : చనిపోయిన అమ్మాయిని వేధించే కుర్రాడు.. ప్రతి 20 నిమిషాలకు ఊహించని మలుపులు.. ఓటీటీని శాసిస్తున్న సినిమా..

Follow Us
తక్కువ ధరకే నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ!
తక్కువ ధరకే నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ!
రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారం.. నోటికి రుచినిచ్చే అద్భుతమైన వంటకం
రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారం.. నోటికి రుచినిచ్చే అద్భుతమైన వంటకం
ఇండక్షన్‌పై వంట చేస్తున్నారా? ఈ 5 వస్తువుల విషయంలో జాగ్రత్త!
ఇండక్షన్‌పై వంట చేస్తున్నారా? ఈ 5 వస్తువుల విషయంలో జాగ్రత్త!
ఉదయం పొట్ట సాఫీగా అవ్వడం లేదా? వాముతో ఈ చిట్కా ప్రయత్నించండి!
ఉదయం పొట్ట సాఫీగా అవ్వడం లేదా? వాముతో ఈ చిట్కా ప్రయత్నించండి!
మహిళకు క్యాన్సర్.. అంటార్కిటికా వెళ్లొచ్చాక తగ్గిన కణితి సైజు!
మహిళకు క్యాన్సర్.. అంటార్కిటికా వెళ్లొచ్చాక తగ్గిన కణితి సైజు!
నవరాత్రి సమయంలో ఉపవాసాలు ఉండటం సురక్షితమేనా? షుగర్, బీపీ ఉన్నవారు
నవరాత్రి సమయంలో ఉపవాసాలు ఉండటం సురక్షితమేనా? షుగర్, బీపీ ఉన్నవారు
విమానాశ్రయంపై దాడి.. నలుగురు భారతీయులు ఐసీయూలో.. : కేంద్రం
విమానాశ్రయంపై దాడి.. నలుగురు భారతీయులు ఐసీయూలో.. : కేంద్రం
పచ్చి కొబ్బరి తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? నిపుణుల సూచన..
పచ్చి కొబ్బరి తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? నిపుణుల సూచన..
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలపై ప్రభుత్వం నిర్ణయం!
ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలపై ప్రభుత్వం నిర్ణయం!