ఇంట్లో బల్లులు పెరిగిపోతున్నాయా? వామ్మో ఇది దేనికి సంకేతం అంటే?

Samatha

13  August 2026

ఇంట్లో బల్లులు ఉండటం అనేది సహజం. ప్రతి ఒక్కరి ఇంటిలో గోడలపై బల్లలు కనిపిస్తూనే ఉంటాయి.  కొందరి ఇంటిలో ఎక్కువగా ఉండవు.

అయితే బల్లులు కనిపించడం కాకుండా, ఒక్కసారిగా వాటి సంఖ్య ఇంటిలో పెరిగినట్లు అనిపిస్తుంది. మరి ఇలా ఇంట్లో బల్లులు పెరిగిపోవడం మంచిదేనా?

బల్లలు పెరిగిపోవడం దేనికి సంకేతం. దీని గురించి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారో, ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

కొన్ని సార్లు ఇంటిలోపల బల్లులు కనిపించవు. కానీ ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో దర్శనం ఇస్తాయి. అయితే ఇలా బల్లులు ఎక్కువగా కనిపించడం మంచిదంట.

బల్లులు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందుకే ఇంటిలో బల్లులు ఉండటం కూడా చాలా మంచిదని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

ముఖ్యంగా ఒక్కసారిగా ఇంటిలో బల్లులు ఎక్కువ అయ్యాయి అంటే, సంపద పెరుగుతున్నట్లు అంట. లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం.

లక్ష్మీదేవి అనుగ్రహం వలన ఇంటిలో బల్లుల సంఖ్య పెరగడం, బల్లులు శబ్ధం చేయడం వంటి సంకేతాలు కనిపిస్తాయని చెబుతున్నారు నిపుణులు.

నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.