AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: వామ్మో ఎలా వస్తున్నాయ్ అక్కా ఈ ఐడియాలు.. భర్తను చంపి ఏం చేసిందో తెలిస్తే..

రోజురోజుకూ వివాహేతర సంబంధాల కారణంగా జరుగుతున్న దారుణాలు పెరిగిపోతున్నాయి. పెళ్లైన తర్వాత కూడా మరో వ్యక్తితో ప్రేమాయణం నడిపిస్తూ.. కట్టుకున్న భాగస్వాములను కాటికి పంపుతున్నారు. తాజాగా ఇలాంటి ఉదంతమే దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. ఆ నెపాన్ని దొంగలపై నెట్టేసింది. కానీ పోలీసుల దర్యాప్తులో అసలు విషయం తేలడంతో కటకటాల పాలైంది.

Viral News: వామ్మో ఎలా వస్తున్నాయ్ అక్కా ఈ ఐడియాలు.. భర్తను చంపి ఏం చేసిందో తెలిస్తే..
Extra Marital Affair
Anand T
|

Updated on: Aug 13, 2026 | 12:10 PM

Share

ప్రియుడి సహాయంతో భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన ఓ భార్య.. ఆ నేరాన్ని దొంగలపై నెట్టేందుకు ప్రయత్నించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రియుడితో పాటు ఆమెను కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌత్ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో మున్నాలాల్ అనే వ్యక్తి తన భార్య మంజుతో కలిసి నివాసముంటున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

మున్నాలాల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తుండగా.. భార్య ఇంట్లోనే ఉంటూ పిల్లలను చూసుకుంటోంది. ఈ క్రమంలో మంజుకు చమన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. దీంతో ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ మంజు భర్తను అడ్డు తొలగించుకోవాలని చూసింది. ప్రియుడు చమన్‌తో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. ఈ నెల 10వ తేదీన తాగునీటిలో మత్తుమందు కలిపి భర్తకు ఇచ్చింది. తర్వాత ప్రియుడితో కలిసి అతని గొంతు నొక్కి.. కరెంట్ షాక్ ఇచ్చి, కర్రతో కొట్టి చంపేసింది.

తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా.. ఒంటిపై ఉన్న గాయాలు చూసి అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఇంట్లో దొంగలు పడ్డారని.. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తన భర్తపై ఎదురుదాడి చేసి చంపేశారని మంజు పోలీసులకు తెలిపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు.

ఆ దృశ్యాల్లో అర్ధరాత్రి 1:45 గంటల సమయంలో ముసుగు ధరించిన ఓ వ్యక్తి ఇంట్లోకి వచ్చి.. తెల్లవారుజామున 3:15 గంటలకు బయటకు వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మంజు మాటలపై అనుమానం వచ్చిన పోలీసులు.. తమదైన రీతిలో ఆమెను ప్రశ్నించగా అసలు విషయం ఒప్పుకుంది. ప్రియుడితో కలిసి తానే భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది.

అంతేకాదు భర్తను హత్య చేసేందుకు ప్రియుడికి రూ. 5 లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుందని.. హత్య తర్వాత రూ. 20,000 కూడా అతనికి ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో మంజుతో పాటు ఆమె ప్రియుడు, వీరికి సహకరించిన మరో వ్యక్తిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us