AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు టేబుల్ స్పూన్స్ తాగితే విరిగిన ఎముకలు కూడా ఉక్కులా అవుతాయ్..అప్పట్లో ఫుల్ డిమాండ్

ప్రస్తుత జీవనశైలిలో ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యలలో ఎముకల బలహీనత ఒకటి. 40 ఏళ్ళు దాటిన తర్వాత, ఆస్టియోపొరోసిస్, కీళ్ల నొప్పులు వంటివి సమస్యలు తరచుగా కనిపిస్తాయి. దీనికి గల ప్రధాన కారణం కాల్షియం లోపం. ఈ సమస్యల నివారణకు, ఎముకలను దృఢంగా మార్చడానికి సబ్జా గింజలు మంచిగా పని చేస్తాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలకు నిధి వంటివి.

Prasanna Yadla
|

Updated on: Sep 23, 2026 | 1:29 PM

Share
కాల్షియం అనేది ఎముకల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. మనం పాలు, పాల ఉత్పత్తుల నుండి కాల్షియం పొందుతాము. అయితే, కొంతమందికి పాలు సరిగా అరగవు,  పాల ఉత్పత్తులను తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వారికి, అలాగే అందరికీ కూడా సబ్జా గింజలు ఒక అద్భుతమైన ఎంపిక. ఈ చిన్న గింజలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది.

1 / 5
100 గ్రాముల పాలలో సుమారు 120mg కాల్షియం లభిస్తే, 100 గ్రాముల సబ్జా గింజలలో పాల కంటే రెండు, మూడు రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. కాల్షియంతో పాటు, సబ్జా గింజలలో మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ ఖనిజాలు ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం.

2 / 5

మెగ్నీషియం ముఖ్యంగా కాల్షియంను ఎముకలలోకి సరిగా చేర్చడానికి, ఎముకల నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది.ఫాస్ఫరస్ కూడా ఎముకలు, దంతాల నిర్మాణానికి అత్యవసరం.ఇది ఫ్రాక్చర్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, అలాగే కీళ్ల నొప్పులు, నడుము నొప్పులను సమర్థవంతంగా నివారిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, చురుకైన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఇవి హెల్ప్ అవుతాయి.

3 / 5
సబ్జా గింజలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం చాలా సులభం. ఒకటి లేదా రెండు చెంచాల సబ్జా గింజలను తీసుకుని, ఒక గ్లాసు నీటిలో 15-20 నిమిషాల పాటు నానబెట్టండి. అవి ఉబ్బి, జెల్ లా మారతాయి. ఈ నానబెట్టిన సబ్జా గింజలను మీరు నేరుగా నీటితో పాటు తాగవచ్చు. వీటిని జ్యూస్‌లలో, స్మూతీలలో, నిమ్మకాయ రసంలో, మజ్జిగలో కలుపుకుని తీసుకోవచ్చు. ఉదయం పరగడుపున కానీ  సాయంత్రం స్నాక్‌గా తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి.

4 / 5
ఎముకల ఆరోగ్యంతో పాటు, సబ్జా గింజలు అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియకు చాలా మంచివి. మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, ఇవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగించడం వలన బరువు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతాయి. ఇంకా జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని అంటున్నారు.

5 / 5
Follow Us