విమానం సీట్ల కింద నుంచి గుప్పుమన్న అత్తరు వాసన.. అనుమానంతో తెరిచి చూస్తే..!
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో సీట్ల కింద దాచిన సుమారు 6.5 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.9 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఓ మహిళ సహా మొత్తం 8 మంది అనుమానిత స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో సీట్ల కింద దాచిన సుమారు 6.5 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.9 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఓ మహిళ సహా మొత్తం 8 మంది అనుమానిత స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు తెలిపారు. బంగారాన్ని గుర్తించకుండా ఉండేందుకు దానిపై స్ప్రే రంగులు పూసి, చైన్ల రూపంలో మార్చినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం విమానంలోని సీట్ల కింద వాటిని దాచినట్లు అధికారులు వెల్లడించారు.
దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అధికారులకు అనుమానం రావడంతో సీట్లను పరిశీలించారు. ఈ క్రమంలో దాచిన బంగారం బయటపడింది. మొత్తం 6.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. దాని విలువను సుమారు రూ.9 కోట్లుగా అంచనా వేశారు.
విచారణలో నిందితులు ఎగ్జిబిషన్ వ్యాపారం పేరుతో తరచూ దుబాయ్‌కు వెళ్లి వస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ ప్రయాణాలను బంగారం అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ముఠాకు దుబాయ్‌లో ఉన్న సంబంధాలు, బంగారం ఎవరికి చేరాల్సి ఉంది, గతంలో ఎన్ని సార్లు ఇదే తరహాలో అక్రమ రవాణా చేశారనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
బంగారం సీజ్ అనంతరం అరెస్టయిన ఎనిమిది మందిని కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ పటియాలా హౌస్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉందా? దుబాయ్ నుంచి బంగారం తీసుకువచ్చిన వ్యక్తులు, ఢిల్లీలో దానిని స్వీకరించాల్సిన వ్యక్తులు ఎవరు? అనే అంశాలపై దర్యాప్తు సంస్థలు మరింత సమాచారం సేకరిస్తున్నాయి. తాజా సీజ్‌తో ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణాపై భద్రతా, కస్టమ్స్ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.
Major Gold Smuggling Gang Busted at IGI Airport Acting on a tip-off, Customs officers thoroughly searched Flight EK-514 (Dubai–Delhi, dated 21.09.2026) and recovered gold disguised as chains — sprayed with silver & black colour— concealed beneath two seats in three small bags. Investigation led to the arrest of 8 passengers, including one woman, travelling on the same flight. Modus Operandi: The group travelled to Dubai under the guise of attending exhibitions, smuggling gold by wearing it as chains/jewellery to evade suspicion.
Total recovery: 6.5 kg gold, valued at approx. ₹9 crore 📌 Sharp vigilance unravels an smuggling conspiracy. All 8 accused, post medical examination, produced before Patiala House Court and remanded to 14 days judicial custody. Further investigation underway.
#IGIAirport #CustomsAlert #GoldSeizure @cbic_india @FinMinIndia @Delhicustoms @CustomsIGIA
— Delhi Customs (Airport & General) (@AirportGenCus) September 23, 2026
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
