AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొబ్బరి పీచుతో నేచురల్ హెయిర్ డై..తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చే అద్భుతమైన చిట్కా!

నేటి కాలంలో చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం చాలా మందిలో సాధారణ సమస్యగా మారింది. దీనికోసం మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన హెయిర్ డైలను వాడటం వల్ల జుట్టు మరింత దెబ్బతింటుంది. అయితే, సహజద్ధమైన పద్ధతిలో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి కొబ్బరి పీచు అద్భుతంగా సహాయపడుతుంది. ఈ నేచురల్ హెయిర్ కలర్‌ తలకు పట్టించడం ద్వారా తెల్ల జుట్టును సహజంగా, సురక్షితంగా నల్లగా మార్చుకోవచ్చు.

కొబ్బరి పీచుతో నేచురల్ హెయిర్ డై..తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చే అద్భుతమైన చిట్కా!
Coconut Husk Hair Dye
Jyothi Gadda
|

Updated on: Nov 05, 2026 | 9:26 PM

Share

ప్రస్తుత ఆధునిక జీవనశైలి, మారుతున్న ఆహారపు అలవాట్లు, కాలుష్యం కారణంగా చాలా మందిలో చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడం జరుగుతోంది. తెల్ల జుట్టును కవర్ చేయడానికి మార్కెట్లో లభించే ఎన్నో రకాల కెమికల్ హెయిర్ డైలను వాడుతుంటారు. కానీ వాటిలో ఉండే హానికరమైన రసాయనాలు జుట్టు కుదుళ్లను దెబ్బతీయడంతో పాటు జుట్టు రాలిపోయేలా చేస్తాయి. రసాయనాల ప్రభావం లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే సహజమైన పద్ధతిలో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి కొబ్బరి పీచు అద్భుతంగా ఉపయోగపడుతుంది.

కొబ్బరి పీచుతో నేచురల్ హెయిర్ డై తయారీ విధానం

కొబ్బరి తొక్కలు లేదా పీచును ఉపయోగించి ఇంట్లోనే సులభంగా సహజసిద్ధమైన హెయిర్ డై తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా కొన్ని ఎండు కొబ్బరి పీచును తీసుకోవాలి. ఒక పాత లోహపు కడాయిని తీసుకుని అందులో ఈ ఎండు కొబ్బరి పొట్టును వేయాలి. తక్కువ మంటపై వాటిని పూర్తిగా నల్లగా మారే వరకు కాల్చాలి. కొబ్బరి పీచు పూర్తిగా కాలి బొగ్గులా లేదా బూడిదలా మారిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తరువాత ఆ బూడిదను మెత్తటి జల్లెడ ద్వారా బాగా జల్లించి, సన్నని నల్లటి పౌడర్‌ను వేరు చేసుకోవాలి. ఇప్పుడు మీ సొంత ఇంట్లోనే స్వచ్ఛమైన నేచురల్ బ్లాక్ హెయిర్ డై పౌడర్ సిద్ధమవుతుంది.

ఈ పౌడర్‌ను ఎలా ఉపయోగించాలి?

హెన్నా తో కలిపి: మీరు తరచుగా తలకు హెన్నా పెట్టుకునే అలవాటు ఉన్నట్లయితే, ఆ మిశ్రమంలో ఈ కొబ్బరి పొట్టు పౌడర్‌ను ఒక స్పూన్ కలపండి. ఇది జుట్టుకు మరింత గాఢమైన నల్లటి రంగును ఇవ్వడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

అలోవెరా జెల్‌తో: కొద్దిగా తాజా అలోవెరా జెల్ తీసుకుని, అందులో ఈ నల్లటి పౌడర్‌ను మిక్స్ చేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. దీనిని బ్రష్ సహాయంతో తెల్ల జుట్టు ఉన్న ప్రదేశాలలో అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు ఆరనిచ్చి కడగాలి.

హెయిర్ ఆయిల్‌లో కలిపి: మీ తలకు రాసుకునే కొబ్బరి నూనె లేదా మీకు ఇష్టమైన హెయిర్ ఆయిల్‌లో రెండు మూడు స్పూన్ల ఈ పౌడర్‌ను కలపాలి. కావాలనుకుంటే ఇందులో విటమిన్-ఇ క్యాప్సూల్ కూడా జోడించవచ్చు. ఈ మిశ్రమాన్ని తలకు, కుదుళ్లకు బాగా పట్టించి 3 నుంచి 4 గంటల పాటు ఉంచిన తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.

ఈ సులభమైన, సహజమైన ఇంటి చిట్కాను క్రమం తప్పకుండా పాటిస్తే, రసాయనాల అవసరం లేకుండా మీ తెల్ల జుట్టును సహజంగా నల్లగా, ఆరోగ్యంగా మార్చుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us