వీరికి దానిమ్మ విషంతో సమానం.. ముట్టుకోకపోవడమే బెటర్‌!

05 November 2026

TV9 Telugu

TV9 Telugu

దానిమ్మపండ్లు ర‌క్తం గ‌డ్డక‌ట్టే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. క‌నుక శ‌స్త్రచికిత్స జ‌ర‌గ‌డానికి ముందు కనీసం రెండు వారాల పాటు దానిమ్మ పండ్లను తీసుకోకూడ‌దు

TV9 Telugu

అంతేకాకుండా అన‌స్థీషియా మందుల‌తో కూడా ఇవి సంక‌ర్షణ చెందుతాయి. దీంతో శ‌స్త్ర చికిత్స స‌మ‌యంలో ర‌క్తస్రావం ఎక్కువ‌గా అయ్యే అవ‌కాశం ఉంది

TV9 Telugu

అలాగే దానిమ్మ పండ్ల‌ల్లో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది జీర్ణక్రియుకు ఎంతో మేలు చేస్తుంది. కానీ సున్నిత‌మైన జీర్ణ వ్యవ‌స్థ ఉన్న వారిపై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది

TV9 Telugu

ఈ పండ్లలో టానిన్లు ఉంటాయి. ఇవి పేగు పొర‌ల‌కు చికాకును క‌లిగిస్తాయి. ఉబ్బరం, విరేచ‌నాలు వంటి స‌మ‌స్యలు వ‌చ్చే అవ‌కాశం ఉంది

TV9 Telugu

అలాగే ఇవి గ‌ట్టిగా ఉంటాయి. త్వర‌గా జీర్ణం కావు. క‌నుక వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణక్రియ‌పై ఒత్తిడి పడే అవ‌కాశం ఉంది

TV9 Telugu

అంతేకాకుండా దానిమ్మ పండ్లు కొంద‌రిలో అల‌ర్జీని క‌లిగించే అవ‌కాశం ఉంది. దుర‌ద‌, ముఖం వాపు రావ‌డం, ద‌ద్దుర్లు వస్తాయి

TV9 Telugu

కొన్ని తీవ్రమైన సంద‌ర్భాల్లో శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది క‌ల‌గ‌డం, అనాఫిలాక్సిన్ వంటి స‌మ‌స్యలు వ‌చ్చే అవకాశం ఉంది

TV9 Telugu

ఆహార అల‌ర్జీ ఉన్న వారిలో దానిమ్మతో క్రాస్ రియాక్షన్ లు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అందుకే అంద‌రికి ఇవి అనుకూలంగా ఉండ‌వ‌ని వైద్యులు చెబుతున్నారు