AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మృత్యువును జయించిన రోహిత.. అవయవదానంతో ఆరుగురికి పునర్జన్మ ప్రసాదించిన చిన్నారి!

సమాజంలో కొన్ని వార్తలు మన గుండెల్ని పిండేస్తాయి. మరికొన్ని వార్తలు కంట తడి పెట్టిస్తూనే మానవత్వంపై నమ్మకాన్ని కలిగిస్తాయి. హైదరాబాద్ నగరంలో ఇటీవల జరిగిన ఒక హృదయ విదారక ఘటన ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురిచేస్తోంది. బడికి వెళ్లి తోటి పిల్లలతో సంతోషంగా గడపాల్సిన ఒక పసి వయసు బాలిక, రోడ్డు ప్రమాద రూపంలో ప్రాణాలు కోల్పోయినా... తన తండ్రి తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం వల్ల ఆరుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఈ స్ఫూర్తిదాయక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మృత్యువును జయించిన రోహిత.. అవయవదానంతో ఆరుగురికి పునర్జన్మ ప్రసాదించిన చిన్నారి!
13 Year Old Girl Saves Six Lives
Jyothi Gadda
|

Updated on: Nov 05, 2026 | 8:07 PM

Share

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 13 సంవత్సరాల చిన్నారి గుడ రోహిత, తన కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయానికి వెళ్లి ఆటోలో ఇంటికి తిరిగి వస్తోంది. ఆ సమయంలో బాలానగర్ ఫ్లైఓవర్ సమీపంలో ఒక అతివేగంగా దూసుకొచ్చిన లారీ వారి ఆటోను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో రోహిత తీవ్ర గాయాలపాలైంది. కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆ చిన్నారిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఎంతగానో శ్రమించి చికిత్స అందించినప్పటికీ, తీవ్ర గాయాల కారణంగా అక్టోబర్ 30న రోహిత బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు అధికారికంగా నిర్ధారించారు.

కంటికి రెప్పలా పెంచుకున్న బిడ్డ ఇక లేదనే వార్త ఆ తల్లిదండ్రులకు పిడుగుపాటులాంటిది. ఆ క్షణంలో ఆ కుటుంబం పడిన క్షోభ వర్ణనాతీతం. అయితే, అంతటి తీవ్రమైన విషాద సమయంలోనూ ఆ చిన్నారి తండ్రి నారాయణ రావు మరియు కుటుంబ సభ్యులు ఒక అసాధారణ, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తమ బిడ్డ భౌతికంగా దూరమైనా, ఆమె అవయవాల ద్వారా ఇతరుల ప్రాణాలు కాపాడవచ్చని భావించారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన జీవన్‌దాన్ అవయవదాన కార్యక్రమం ద్వారా రోహిత కిడ్నీలు, కాలేయం భాగాలు, రెండు కార్నియాలను దానం చేయడానికి అంగీకరించారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

కుటుంబ సభ్యుల ఈ చొరవ వల్ల నలుగురైదుగురు వేర్వేరు రోగులకు ఆయా అవయవాలను విజయవంతంగా అమర్చి, మొత్తం ఆరుగురికి పునర్జన్మ ప్రసాదించారు. ఈ మానవీయ ఘటనపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, కూకట్‌పల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని రోహితను కోల్పోయిన తండ్రి నారాయణ రావు చూపిన దాతృత్వం నన్ను ఎంతగానో కదిలించింది అని కొనియాడారు. రోహిత రూపంలో ఆ ఆరుగురు వ్యక్తులు జీవిస్తారని, చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు. మరణం తర్వాత కూడా ప్రాణాలు పంచవచ్చని నిరూపించిన ఈ తండ్రి నిర్ణయం సమాజానికి ఎప్పటికీ ఒక పెద్ద ఆదర్శం.

Follow Us