అపరాజిత పూలు, అవిసె గింజలతో గ్లోయింగ్ స్కిన్.. ఇంట్లోనే ఈ DIY బ్యూటీ చిట్కాలు ట్రై చేయండి!
అపరాజిత పూలు, అవిసె గింజల కలయిక చర్మానికి అద్భుతమైన మెరుపును అందిస్తుంది. ఇవి పిగ్మంటేషన్, మచ్చలు, ముడతలను తగ్గించి, చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ సహజమైన పదార్థాలతో ఇంట్లోనే ఫేస్ జెల్, మాస్క్, సీరం తయారు చేసుకోవచ్చునని చర్మ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు. తయారీ విధానం, ఉపయోగాలేంటో వివరంగా తెలుసుకుందాం..

చర్మ రక్షణకు రసాయనాలతో కూడిన క్రీముల కంటే సహజసిద్ధమైన చిట్కాలు ఎంతో సురక్షితమైనవి, ప్రభావవంతమైనవి. శంఖు పువ్వుల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు చర్మానికి అవసరమైన పోషణను అందిస్తాయి. ఈ రెండింటి కాంబినేషన్ చర్మాన్ని కాంతివంతంగా మార్చడమే కాకుండా వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వవు.
1. డిఐవై ఫేస్ జెల్
తయారీ విధానం:
ఒక పాత్రలో నీరు తీసుకుని అందులో కొన్ని అపరాజిత పూలు, 2 స్పూన్ల అవిసె గింజలు వేసి బాగా మరిగించాలి. నీరు చిక్కబడి జెల్ లాగా మారిన తర్వాత వడకట్టాలి.
ఉపయోగం:
ఈ జెల్‌ను ముఖానికి రాసి 15-20 నిమిషాల పాటు ఉంచి, ఆపై చల్లటి నీటితో కడగాలి. ఇది చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేస్తుంది. సహజమైన గ్లో ఇస్తుంది.
2. యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్
తయారీ విధానం:
పైన తయారు చేసిన జెల్‌లో కొద్దిగా ముల్తానీ మట్టి లేదా బియ్యప్పిండి, కొద్దిగా గులాబీ నీరు కలపాలి.
ఉపయోగం:
ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై సమానంగా అప్లై చేయాలి. ప్యాక్ ఆరిపోయిన తర్వాత సున్నితంగా మసాజ్ చేస్తూ కడిగేయాలి. ఇది చర్మంపై ఉన్న ముడతలు, గీతలను తగ్గించి చర్మాన్ని బిగుతుగా చేస్తుంది.
3. గ్లోయింగ్ ఫేస్ సీరం
తయారీ విధానం:
అపరాజిత జెల్‌లో కొన్ని చుక్కల విటమిన్-ఇ ఆయిల్ లేదా అలోవెరా జెల్ కలిపి ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.
ఉపయోగం:
రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకుని, ఈ సీరమ్‌ను కొన్ని చుక్కలు రాసి మసాజ్ చేయాలి. ఇది పిగ్మంటేషన్, నల్లటి మచ్చలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
ఈ సహజ సిద్ధమైన హోమ్‌మేడ్ రెమెడీస్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా, దృఢంగా, కాంతిలీనుతూ కనిపిస్తుంది.




