AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమోసాలు, మోమోస్ చట్నీలలో కృత్రిమ రంగులపై నిషేధం.. నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష!

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆహార భద్రత దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది. సమోసాలు, మోమోస్, చాట్, కబాబ్‌ల వంటి స్ట్రీట్ ఫుడ్స్‌తో వడ్డించే ఎరుపు, ఆకుపచ్చ చట్నీలలో కృత్రిమ రసాయన రంగుల వాడకాన్ని నిషేధించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FSDA) జారీ చేసిన ఈ కొత్త నిబంధనల ప్రకారం, వ్యాపారులు చట్నీలకు రంగు కోసం టమోటాలు, బీట్‌రూట్, కొత్తిమీర, పుదీనా, కాశ్మీరీ కారం వంటి సహజ పదార్థాలను మాత్రమే ఉపయోగించాలి. రోడామైన్ బి, మెటానిల్ ఎల్లో వంటి ప్రమాదకర రసాయన రంగులను వాడితే భారీ జరిమానాలు, జైలు శిక్ష విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.

సమోసాలు, మోమోస్ చట్నీలలో కృత్రిమ రంగులపై నిషేధం.. నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష!
Uttar Pradesh Food Safety Rules
Jyothi Gadda
|

Updated on: Nov 01, 2026 | 7:48 PM

Share

వీధి వ్యాపారుల వద్ద దొరికే వేడి వేడి సమోసాలు, మోమోస్, చాట్ లేదా రోల్స్‌ను ప్రకాశవంతమైన ఎరుపు లేదా ఆకుపచ్చ చట్నీతో తింటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఆహార భద్రత, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. స్ట్రీట్ ఫుడ్స్‌తో కలిపి ఇచ్చే చట్నీలలో హానికరమైన కృత్రిమ రసాయన రంగుల వాడకాన్ని యూపీ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FSDA) పూర్తిగా నిషేధించింది.

సహజ పదార్థాలనే ఉపయోగించాలి!

నూతన మార్గదర్శకాల ప్రకారం.. వీధి వ్యాపారులు మరియు రెస్టారెంట్ నిర్వాహకులు చట్నీలకు ఆకర్షణీయమైన రంగును తీసుకురావడం కోసం కెమికల్స్‌ను వాడకూడదు. టమోటాలు, బీట్‌రూట్, కాశ్మీరీ ఎర్రమిరపకాయలు లేదా దేగీ మిర్చి వంటి సహజ పదార్థాలను మాత్రమే ఉపయోగించాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఆధారిత సహజ మిశ్రమాలను మాత్రమే వాడాలి. ఈ నిషేధం కేవలం సమోసా, మోమోస్ చట్నీలకే కాకుండా కబాబ్‌లు, టిక్కాలు, చాప్, కాటన్ క్యాండీ, ఐస్ లాలీలకు కూడా వర్తిస్తుంది.

ప్రమాదకర రసాయన రంగులపై ఆంక్షలు

చాలామంది వ్యాపారులు చట్నీలు, స్వీట్లలో గుడ్డలు, కాగితాలకు రంగు వేసేందుకు వాడే రోడామైన్ బి, మెటానిల్ ఎల్లో, బటర్ ఎల్లో, గ్రీన్, సుడాన్ రంగుల వంటి పారిశ్రామిక డైలను ఉపయోగిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. ఇవి మానవ శరీరానికి తీవ్ర హాని కలిగిస్తాయి. అంతేకాకుండా వండిన పప్పులు, కూరగాయలు, బిర్యానీ, ఫ్రెంచ్ ఫ్రైస్‌లలో కూడా కృత్రిమ రంగులను అనుమతించబోమని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ఈ నిబంధనలను ఉల్లంఘించే వ్యాపారులపై ఆహార భద్రత, ప్రమాణాల చట్టం, 2006 (FSSA) కింద కఠిన చర్యలు తీసుకుంటారు. నాణ్యత లేని ఆహారం అమ్మితే సెక్షన్ 51 కింద రూ. 5 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. తప్పుదారి పట్టించే బ్రాండింగ్ ఉంటే సెక్షన్ 52 కింద రూ. 3 లక్షల వరకు ఫైన్ పడుతుంది. అలాగే, సురక్షితం కాని ఆహారం విక్రయిస్తే సెక్షన్ 59 ప్రకారం 6 నెలల జైలు శిక్ష, రూ. 1 లక్ష వరకు జరిమానా ఉంటుంది. ఒకవేళ ఈ కల్తీ ఆహారం వల్ల ఎవరైనా మరణిస్తే, ఏడేళ్ల నుండి జీవిత ఖైదు వరకు జైలు శిక్ష, రూ. 10 లక్షల కంటే ఎక్కువ జరిమానా విధిస్తారు. ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Follow Us