AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీజీపీఎస్సీ ఏఈఈ పరీక్షలకు సర్వం సిద్ధం.. నవంబర్ 6, 7 తేదీల్లో పరీక్షలు..అభ్యర్థులకు కీలక ఆదేశాలు!

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఆధ్వర్యంలో రవాణా, రోడ్లు, భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE - Civil) పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నియామక పరీక్షను కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) విధానంలో అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. నవంబర్ 6 మరియు 7 తేదీలలో ఈ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా జరగనున్నాయి.

టీజీపీఎస్సీ ఏఈఈ పరీక్షలకు సర్వం సిద్ధం.. నవంబర్ 6, 7 తేదీల్లో పరీక్షలు..అభ్యర్థులకు కీలక ఆదేశాలు!
Tgpsc Aee Civil Exam 2026
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Nov 05, 2026 | 8:32 PM

Share

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో రవాణా, రోడ్లు, భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పరీక్షలు నవంబర్ 6, 7 తేదీలలో అత్యంత పకడ్బందీగా నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29,078 మంది అభ్యర్థులు దఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలోని 14 జిల్లాల్లో ఏర్పాటు చేసిన మొత్తం 38 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షలు జరగనున్నాయి.

ఈ పరీక్షల షెడ్యూల్ ప్రకారం, నవంబర్ 6, 7 తేదీలలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పరీక్ష జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 02:30 నుండి సాయంత్రం 05:00 వరకు పేపర్-2 సివిల్ ఇంజనీరింగ్ పరీక్ష నిర్వహించబడుతుంది. పరీక్ష రాసే అభ్యర్థులు హాల్‌టికెట్‌లో సూచించిన పరీక్షా కేంద్రం చిరునామాను ముందుగానే పరిశీలించుకోవాలని, పరీక్ష రోజున సమయానికి చేరుకోవడానికి వీలుగా లొకేషన్‌ను ముందే తెలుసుకోవాలని కమిషన్ సూచించింది.

పక్షా కేంద్రాల వద్ద బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఫోటో క్యాప్చర్ తదితర లాంఛనాలను పూర్తి చేయడానికి ఉదయం సెషన్‌కు 8:30 AM నుండి 9:30 AM వరకు, మధ్యాహ్న సెషన్‌కు 01:00 PM నుండి 02:00 PM వరకు అనుమతిస్తామని అభ్యర్థులు గమనించాలని కోరారు. దొంగతనంగా పరీక్ష రాయడాన్ని నివారించేందుకు బయోమెట్రిక్ తంబ్ ఇంప్రెషన్ సేకరిస్తున్నందున, చేతులకు మెహందీ, టాటూలు వంటివి వేసుకోవద్దని స్పష్టం చేశారు. అభ్యర్థులు హాల్‌టికెట్, ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ కార్డు, నలుపు లేదా నీలం రంగు పెన్ను మాత్రమే లోపలికి తీసుకెళ్లాలని, మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు పూర్తిగా నిషేధం ఉందని హెచ్చరించారు. అభ్యర్థులు బూట్లకు బదులుగా కేవలం చెప్పులు మాత్రమే ధరించాలని, నిబంధనలు అతిక్రమిస్తే అనర్హత వేటు తప్పదని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us