AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒళ్లు నొప్పులు మాయం చేసే పాయసం.. ఒక్క కప్పు తాగినా చాలు!

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందుకే తప్పకుండా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం మాత్రం తీసుకోవాలి అంటుంటారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది పోషకాలు ఉన్న ఫుడ్ పక్కన పెట్టి జంక్ ఫుడ్‌కు అలవాటై అనేక అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. కానీ ఇలాంటి సమయంలో మీ ఆరోగ్యానికి మేలునిచ్చే ఒక అద్భుతమైన పాయం తెలుసుకుందాం. ఇంతకీ అది ఏంటో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Nov 05, 2026 | 5:13 PM

Share
మినపప్పు పాయసం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన దీనిని తాగడం వలన ఇది ఒంటి నొప్పులను మాయం చేసి, ఎముకల ఆరోగ్యానికి, శరీర పుష్టికి చాలా ఉపయోగపడుతుంది. కాగా, ఇప్పుడు మనం దానిని ఎలా చేయాలో చూసేద్దాం.

1 / 5
తయారీ విధానంలోకి  వెళ్లితే.. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో ఒక టీ స్పూన్ నెయ్యి తీసుకోవాలి. తర్వాత అందులో సన్నగా తరిగిన జీడిపప్పు, బాదంపప్పు ముక్కలను దోరగా వేయించాలి. కొద్దిగా వేగాక, పావు కప్పు పచ్చి కొబ్బరి పొడిని  వేసి బాగా కలిపాలి.అదే పాన్ లోకి పావు కప్పు మినపగుళ్ళను తీసుకొని మంచిగా వేయించుకోవాలి. తర్వాత వీటన్నింటిని పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు మినపప్పు వేగాక, ఒక టీ స్పూన్ బియ్యం, చిటికెడన్నీ మెంతులు కలిపి మరో రెండు మూడు నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటన్నింటిని గ్రైండ్ చేసుకొని పౌడర్ లా తయారు చేసుకోవాలి.తర్వాత ఒక బౌల్ లోకి గ్రైండ్ చేసిన పిండిని తీసుకొని, ఒక కప్పు నీటిని పోసి పిండి ముద్దలు లేకుండా బాగా కలపాలి.

3 / 5
తర్వాత మరొక పాన్ తీసుకొని అందులోకి  ముప్పావు కప్పు బెల్లం, అర కప్పు నీళ్లు తీసుకొని బెల్లం కరిగే వరకు వేడి చేయండి. సిరప్ పాకం రానవసరం లేదు. కరిగిన బెల్లం నీళ్లను వడగట్టి పక్కన పెట్టుకోండి. పాన్ ను శుభ్రం చేసి, రెండున్నర కప్పుల  నీటిని తీసుకోండి. నీళ్లు గోరువెచ్చగా అయ్యాక, కలిపి పెట్టుకున్న మినపప్పు పిండిని మరోసారి కలిపి నీటిలో వేసి బాగా కలపాలి. దీని వలన ముద్దలు కట్టకుండా ఉంటుంది.

4 / 5
పాయసం కాస్త చిక్కబడిన తర్వాత, వడగట్టిన బెల్లం నీళ్లను కలిపి మరో రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించండి. పావు కప్పు పచ్చి కొబ్బరి పొడిని కలిపి రెండు నిమిషాలు ఉడికించాలి. పాయసం చిక్కబడిన తర్వాత, అర టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడంత ఉప్పు కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. చివరగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదంపప్పు, కొబ్బరి మిశ్రమం వేయాలి అంతే టేస్టీ టేస్టీ మినపప్పు పాయసం రెడీ.

5 / 5
Follow Us