AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయంలో అపచారం.. ఏకంగా నంది వాహనంపై ఎక్కి..!

పంచభూత క్షేత్రాలలో అగ్ని క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో ఈ ఏడాది కార్తీక దీపోత్సవాలు నవంబర్ 15వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్తీక దీపోత్సవానికి సంబంధించి ఆలయంలో వివిధ ముందస్తు ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గత రెండు రోజులుగా అగ్నిమాపక శాఖ సిబ్బంది ఆలయంలోని నాలుగు గోపురాలను నీటితో శుభ్రం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు.

తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయంలో అపచారం.. ఏకంగా నంది వాహనంపై ఎక్కి..!
Tiruvannamalai Arunachaleswarar Temple
Balaraju Goud
|

Updated on: Nov 05, 2026 | 8:53 PM

Share

పంచభూత క్షేత్రాలలో అగ్ని క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో ఈ ఏడాది కార్తీక దీపోత్సవాలు నవంబర్ 15వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్తీక దీపోత్సవానికి సంబంధించి ఆలయంలో వివిధ ముందస్తు ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గత రెండు రోజులుగా అగ్నిమాపక శాఖ సిబ్బంది ఆలయంలోని నాలుగు గోపురాలను నీటితో శుభ్రం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే, బుధవారం (నవంబర్ 05) అరుణాచలేశ్వర ఆలయంలోని రాజగోపురం లోపలి భాగాన్ని అగ్నిమాపక సిబ్బంది నీటితో శుభ్రం చేస్తున్న సమయంలో, స్వామివారి వీధి ఉత్సవాలకు ఉపయోగించే నంది వాహనంపైకి ఎక్కి గోపురాన్ని శుభ్రం చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు, శివాచార్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ చర్యను ఖండించారు.ఈ నేపథ్యంలో తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయ యాజమాన్యం చర్యలు చేపట్టింది. తిరుమంజన గోపురం సమీపంలో విధులు నిర్వహిస్తున్న ఆలయ ఉద్యోగి అశోక్‌ను తాత్కాలికంగా విధుల నుంచి సస్పెండ్ చేస్తూ హిందూ దేవాదాయ శాఖ కమిషనర్ పరనిధరన్ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా, నంది వాహనంపైకి ఎక్కి శుభ్రపరిచే పనుల్లో పాల్గొన్న అగ్నిమాపక శాఖ సిబ్బంది తమ చర్యకు క్షమాపణలు కోరుతూ లేఖ రాసి ఆలయ అధికారులకు అందజేశారు.

అరుణాచలేశ్వర ఆలయంలో స్వామివారి వీధి ఉత్సవాలకు ఉపయోగించే పవిత్రమైన నంది వాహనంపైకి ఎక్కి అగ్నిమాపక సిబ్బంది శుభ్రపరిచే పనులు చేయడం భక్తుల్లో తీవ్ర ఆందోళనకు, అసంతృప్తికి కారణమైంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us