AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పల్లె సంగతేంటి.. గ్రామీణ ఓటరు పోటెత్తాడా.. రూరల్ పల్స్ ఎటువైపు..?

టౌను పక్కకెళ్లొద్దురో.. డౌనైపోతావురో అన్నట్టు నిన్నమొన్నటిదాకా టౌను పక్క జరిగిన వయొలెంట్ సీన్లను చూసి బెంబేలెత్తిపోయారు జనం. నామినేషన్ల తంతు దగ్గర మొదలై ఫలితాల విడుదల దాకా పెద్ద పరేషాన్లే రేపింది ఏపీలో పుర పోరు. రెచ్చగొట్టింది ఎవరు.. రెచ్చిపోయింది ఎవరు అనేది పక్కకుబెడితే, రచ్చ జరిగిన మాటైతే నిజం. కట్‌చేస్తే ఇప్పుడు పల్లె వంతొచ్చింది. పరిషత్ ఓటు చుట్టూ చక్కర్లు కొడుతోంది రాజకీయం. పోలింగ్ సరళి ఎలా ఉంది, ఏమని సంకేతాలిస్తోంది..

Andhra Pradesh: పల్లె సంగతేంటి.. గ్రామీణ ఓటరు పోటెత్తాడా.. రూరల్ పల్స్ ఎటువైపు..?
Andhra Pradesh Rural Local Body Elections 2026
Krishna S
|

Updated on: Nov 05, 2026 | 9:50 PM

Share

ఉత్తరకోస్తాలో అర్నబ్ అరాచకం.. దక్షిణ కోస్తాలో మురసు బీభత్సం.. తుఫాను పీడిత ఏపీ ఇంకా కోలుకోకముందే, నాలుగు జిల్లాల్లో మూడురోజుల నుంచి కుండపోత కురుస్తుండగానే, పొలాలన్నీ చెరువులై అన్నదాత అల్లాడిపోతుండగానే.. మరోవైపు నుంచి పల్లెపల్లెలో ఓట్ల పండగ ముంచుకొచ్చింది. ఇప్పటికే ఓసారి రీషెడ్యూల్ ఐంది గనుక, మళ్లీ తేదీలు మార్చే సాహసం చెయ్యలేదు స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఫలితం… 28 జిల్లాల పరిధిలో 7767 MPTCలు, 582 ZPTCల్లో ఎన్నికలు. 18 వేల 843 మంది ఎంపీటీసీ అభ్యర్థులు, 2 వేల 169 మంది జెడ్పీటీసీ అభ్యర్థుల భవిష్యత్తును బ్యాలెట్ బాక్సుల్లో భద్రపరిచారు ఓటర్లు. ఇప్పటికే 77 జెడ్‌పీటీసీలు, 2 వేల 51 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి కనుక, మిగతా క్యాండేట్స్ అందరికీ 48 గంటల పాటు ఆశనిరాశల మధ్య ఊగిసలాట తప్పదు. కడప, నంద్యాల, పల్నాడులో అక్కడక్కడా కొన్ని టెన్షన్లు, వాగ్వాదాలు, తోపులాటలు, బైఠాయింపులు తప్పితే రాష్ట్రం మొత్తమ్మీద సజావుగానే సాగింది పల్లెపోరు. కరెంట్ లేక పోలింగ్ కేంద్రాలు అంధకారంగా మారి, కొవ్వొత్తుల వెలుగులోనే ఎన్నికలు జరగడం, భారీ వర్షంలోనూ ఓటింగ్‌లో పాల్గొనడం.. ఇలా కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. అన్నట్టుంది ఏపీలో పరిషత్ పోలింగ్ చిత్రం. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడు టీడీపీ కార్యకర్తలపై కర్రలతో దాడి జరిగింది. ముగ్గురికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో ఒక మహిళపై YCP ZPTC అభ్యర్థి అంజిరెడ్డి దాడికి యత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పెదకాకానిలో...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి