తల్లి కావాలని ఉంది.. బిడ్డను దత్తత తీసుకుంటా.. శ్రుతి హాసన్..

Rajitha Chanti

Pic credit - Instagram

23 September 2026

మాతృత్వంపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ మనసులోని మాటలను పంచుకున్నారు. అవసరమైతే పిల్లలను దత్తత తీసుకుంటానని అన్నారు.

ఏ విషయనైనా కుండబద్దలు కొట్టినట్లు బోల్డ్‌గా మాట్లాడే శ్రుతి హాసన్, తాజాగా ఓ పాడ్‌కాస్ట్ షోలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తనకు టీనేజ్ వయసు నుంచే పీసీఓఎస్ సమస్య ఉందని, అప్పటి నుంచి వైద్యులు చెప్పిన మాటల వల్ల తనకు భయం కలిగిందని చెప్పుకొచ్చారు.

భవిష్యత్తులో తాను సహజంగా తల్లి కాగలనా లేదా అనే భయం తనను తీవ్రంగా వెంటాడిందని తెలిపారు. ఆ చిన్న వయసులో ఎదురైన అనుభవాల కారణంగా

మాతృత్వం అనే అంశంపై మాట్లాడడానికే తాను ఎంతో సంకోచించేదానినని ఆమె పేర్కొన్నారు.  తనకు పిల్లలంటే ఎంతో ఇష్టమని, తాను నిజంగానే ఒక తల్లి కావాలనుకుంటున్నానని తెలిపారు. అనుభవాల కారణంగా

సహజంగా తల్లి అయ్యే అవకాశాలను పరిశీలించడంతో పాటు, ఒకవేళ కుదిరితే పిల్లలను దత్తత తీసుకోవడానికి కూడా తాను పూర్తిగా సిద్ధమేనని అన్నారు. 

 దత్తత తీసుకోవడం ద్వారా ఒక బిడ్డకు మంచి జీవితాన్ని ఇవ్వవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా అండాల భద్రత ప్రక్రియపై కూడా మాట్లాడారు.

 దత్తత తీసుకోవడం ద్వారా ఒక బిడ్డకు మంచి జీవితాన్ని ఇవ్వవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా అండాల భద్రత ప్రక్రియపై కూడా మాట్లాడారు.