AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: బ్యాడ్ టీచర్ బాగోతం.. జడ్పీ హైస్కూల్‌లో సైన్స్ టీచర్‌పై పోక్సో కేసు

అన్నమయ్య జిల్లాలో గుర్రంకొండ మండలం తరిగొండ జడ్పీ హైస్కూల్‌లో సైన్స్ టీచర్ జాకీర్ విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఫిర్యాదులు రావడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టి విద్యార్థులు, తల్లిదండ్రుల స్టేట్మెంట్లు రికార్డు చేశారు. . .

Andhra: బ్యాడ్ టీచర్ బాగోతం.. జడ్పీ హైస్కూల్‌లో సైన్స్ టీచర్‌పై పోక్సో కేసు
Zakir
Raju M P R
| Edited By: |

Updated on: Feb 07, 2026 | 9:31 AM

Share

అన్నమయ్య జిల్లాలో ఓ టీచర్ అసభ్యకర ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. గుర్రంకొండ మండలం తరిగొండ జడ్పీ హైస్కూల్‌లో సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్న జాకీర్‌పై విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. టీచర్ జాకీర్ విద్యార్థినుల పట్ల బ్యాడ్ టచ్ చేస్తున్నాడంటూ విద్యార్థినులు తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేయగా జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. పేరెంట్స్ ఫిర్యాదు మేరకు విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. మదనపల్లి డివైఈవో లోకేశ్వర్ రెడ్డి పాఠశాలకు చేరుకుని విద్యార్థులు, తల్లిదండ్రులను విచారించారు. అలాగే స్టూడెంట్స్ పేరెంట్స్‌తో స్టేట్మెంట్లు కూడా రికార్డు చేశారు. విచారణలో టీచర్ జాకీర్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు వెల్లడి అయినట్లు అధికారులు తెలిపారు. టీచర్ ప్రవర్తనపై సహచర ఉపాధ్యాయులను కూడా విచారించినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి అందజేయనున్నట్లు డివైఈవో లోకేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, పేరెంట్స్ ఫిర్యాదు మేరకు గుర్రంకొండ పోలీస్ స్టేషన్‌లో టీచర్ జాకీర్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. తనపై ఆరోపణలు రావడంతో జాకీర్ గత మూడు రోజులుగా పాఠశాలకు రాకుండా సెలవు పెట్టినట్లు తెలుస్తోంది. విద్యార్థినుల పట్ల టీచర్ అసభ్యకరంగా ప్రవర్తించిన విషయం వాస్తవమేనని హెచ్ఎం రామచంద్ర తెలిపారు. ప్రస్తుతం టీచర్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..