AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్కౌట్ ఎప్పుడు చేయాలో తెలుసా? ఏ టైమ్‌లో చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయ్

వ్యాయామం చేసే సమయం మీ ఫలితాలపై చూపే ప్రభావం గురించి నిపుణులు కీలక విషయాలు చెబుతున్నారు. ఉదయం చేసే వర్కౌట్స్ క్రమశిక్షణను, మెటాబాలిజాన్ని పెంచితే, సాయంత్రం వేళ చేసే వ్యాయామాలు శారీరక పటుత్వానికి, ఒత్తిడి తగ్గింపునకు మేలు చేస్తాయి. మీ జీవనశైలికి తగ్గట్టుగా సరైన సమయాన్ని ఎంచుకోవడం ముఖ్యం

వర్కౌట్ ఎప్పుడు చేయాలో తెలుసా? ఏ టైమ్‌లో చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయ్
Workouts
Nikhil
|

Updated on: Apr 30, 2026 | 11:20 AM

Share

వ్యాయామం అనగానే మనం సాధారణంగా ఎన్ని సెట్లు చేస్తున్నాం, ఎంత బరువు ఎత్తుతున్నాం అనే దానిపైనే దృష్టి పెడతాం. కానీ ఏ సమయంలో వ్యాయామం చేస్తున్నాం అనేది చాలామంది పట్టించుకోరు. అయితే, వ్యాయామం చేసే సమయం కూడా ఫలితాలపై ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. శరీరతత్వం, జీవనశైలిని బట్టి ఉదయం లేదా సాయంత్రం వ్యాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు మారుతూ ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

ఉదయం వర్కౌట్స్

చాలామంది ఫిట్‌నెస్ ప్రియులు ఉదయాన్నే వ్యాయామం చేయడానికి మొగ్గు చూపుతారు. దీనివల్ల రోజంతా ఉండే ఆఫీస్ మీటింగ్‌లు లేదా ఇతర పనుల ఒత్తిడి వల్ల వర్కౌట్ మిస్ అయ్యే అవకాశం ఉండదు. అంటే వ్యాయామంలో స్థిరత్వం మెరుగ్గా ఉంటుంది. ఉదయాన్నే చెమట చిందించడం వల్ల మెటాబాలిజం వేగవంతం అవుతుంది, ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది.

అంతేకాకుండా, మెదడు చురుగ్గా మారి పనులపై ఏకాగ్రత పెరుగుతుంది. ఒక మంచి పనితో రోజును ప్రారంభించామనే విజయ భావన మీ మూడ్‌ని రోజంతా పాజిటివ్‌గా ఉంచుతుంది. అయితే, ఉదయం వేళ శరీరం కొంత బిగుసుకుపోయి ఉంటుంది కాబట్టి, నేరుగా బరువులు ఎత్తకుండా కచ్చితంగా వార్మప్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

సాయంత్రం వర్కౌట్స్

శారీరక పటుత్వం మరియు పర్ఫార్మెన్స్ మెరుగుపడాలి అనుకునేవారికి సాయంత్రం సమయం ఉత్తమమని కుశాల్ పాల్ సింగ్ తెలిపారు. రోజంతా మనం కదులుతూ ఉంటాం కాబట్టి, సాయంత్రానికి శరీరం సహజంగానే సిద్ధమై ఉంటుంది. కండరాలు సరళంగా ఉండటం వల్ల భారీ బరువులు ఎత్తడానికి ఇది అనువైన సమయం. ఆఫీసులో పడ్డ రోజంతా టెన్షన్‌ను వదిలించుకోవడానికి ఈవినింగ్ వర్కవుట్ ఒక అద్భుతమైన ‘స్ట్రెస్ బస్టర్’లా పనిచేస్తుంది. కానీ, సాయంత్రం పూట తీవ్రమైన వ్యాయామాలు చేస్తే కొందరిలో నిద్ర పట్టడం కష్టమవ్వచ్చు. అలాగే రోజంతా పని చేసి అలసిపోవడం వల్ల వ్యాయామం చేయడానికి బద్ధకించే అవకాశం కూడా ఉంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సమయం కంటే ‘కన్సిస్టెన్సీ’ ముఖ్యం. మీకు ఒక క్రమపద్ధతి కావాలనుకుంటే ఉదయం సమయాన్ని, కేవలం బలం మరియు పర్ఫార్మెన్స్ పెంచుకోవడమే లక్ష్యం అయితే సాయంత్రం సమయాన్ని ఎంచుకోవచ్చు. మీ దైనందిన జీవితానికి ఏది అడ్డంకి కాదో ఆ సమయాన్నే ఖరారు చేసుకోవడం ఉత్తమం. గుర్తుంచుకోండి, ఆరోగ్యం విషయంలో గడియారం కంటే మీ సంకల్పమే ముఖ్యం!

Follow Us