ఆపిల్ పండుతో ఊరగాయ.. ఇలా పెడితే అదిరి పోవాల్సిందే!

samatha

30 April 2026

ఆపిల్ పండును ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. ముఖ్యంగా వీటిలో పోషకాలు పుష్కలంగా ఉండటం వలన చాలా మంది వీటిని ఎక్కువ తినడానికి ఇంట్రస్ట్ చూపిస్తారు.

ఆపిల్స్

వీటి రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు వీటిని ఇష్టంగా తింటారు. అయితే వీటిని తినడమే కాకుండా ఊరగాయ కూడా పెట్టుకొచ్చునంట.

ఊరగాయ

ఆపిల్ పండ్లతో ఊరగాయ పెట్టుకొని తింటే టేస్ట్ అదిరిపోతుందని చెబుతున్నారు. మరి దీనిని ఇంటిలోనే చాలా సులభంగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం.

తయారు చేసే విధానం

ఆపిల్ ముక్కలను బాగా కడికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అంతే కాకుండా వీటిని తడి లేకుండా ఫ్యాన్ దగ్గర వేసి ఆరబెట్టాలి.

ఆపిల్ ముక్కలు

ఆపిల్ ముక్కలు తడి ఆరిన తర్వాత వీటిని ఒక బౌల్‌లో వేసి ఆవ పొడి, ఉప్పు, కారం, పసుపు, మెంతి పొడి చిటికెడు వేసి బాగా కలిపి గాజు సీసాలో స్టోర్ చేయాలి.

తడి ఆరడం

మరసటి రోజు దీనిని పోపు వేసుకోవాలి. దీని కోసం ఒక బౌల్ తీసుకొని, స్టవ్ ఆన్ చేయాలి. ఆ బౌల్‌లో పోపుకు సరిపడ నూనె పోసుకోవాలి.

పోపు

తర్వాత అందులో ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ,  వేసి మంచిగా వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసి మంచిగా  వేయించుకోవాలి.

ఎండు మిర్చీ ఆవాలు

తర్వాత స్టవ్ ఆఫ్ చేసి. పోపు చల్లారబెట్టుకోవాలి.  ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఆపిల్ ముక్కల్లో ఈ పోపు వేయాలి. అంతే ఆపిల్ ఊరగాయ రెడీ.

పచ్చడి రెడీ