AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లికి ముందే గర్భందాల్చా.. అందుకే హడావిడిగా వివాహం చేసుకున్నా.. తప్పేముంది

రోజులు మారాయి.. ఇప్పుడు లివింగ్ రిలేషన్ , లవ్ ఎఫైర్స్, పెళ్లిళ్లు అనేవి చాలా కామన్ అయ్యాయి. ఎక్కువగా సినీ సెలబ్రెటీల విషయంలో ఎక్కువగా ఇలాంటి వార్తలు వింటుంటాం. కొంతమంది పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం పెళ్లి పేరు ఎత్తకుండా సైలెంట్ గా ఉంటారు.

పెళ్లికి ముందే గర్భందాల్చా.. అందుకే హడావిడిగా వివాహం చేసుకున్నా.. తప్పేముంది
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 30, 2026 | 11:02 AM

Share

చాలా మంది సెలబ్రెటీలు సినిమాలతో కంటే వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తుంటారు. ఇక ప్రేమలు, పెళ్లి, విడాకులులాంటివి సర్వసాధారణం అయ్యాయి. ఇండస్ట్రీలో రెండు ముందు పెళ్లిళ్లు చేసుకున్నవారు కూడా ఉన్నారు. కొంతమంది పెళ్లి లేకుండా సింగిల్ గా ఉంటున్నారు. అలాగే పెళ్లి కాకుండానే తల్లి అవ్వొచ్చు అంటూ స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు. ఇటీవలే నిత్యామీనన్ కూడా ఇదే విషయాన్నీ తెలిపింది. అలాగే పెళ్ళికి ముందే తల్లైన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా పెళ్ళికి ముందే తల్లి అయ్యాను అని తెలిపి షాక్ ఇచ్చింది. అంతే కాదు పెళ్ళికి ముందే గర్బం దాల్చడంతో హడావిడిగా పెళ్లి చేసుకున్నా అని తెలిపింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? చాలా మంది అభిమాన హీరోయిన్ ఆమె..

ఇది కూడా చదవండి : Folk Song: ఎంతో అదృష్టం చేసుకుంటే నాకు ఆ పాట వచ్చింది.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్

నేహా ధూపియా.. ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2003లో ‘ఖయామత్’ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ‘జూలీ’, ‘శిఖర్’, ‘చుప్ చుప్ కే’, ‘షీషా’, ‘ఫ్యాన్స్ గయే రే ఒబామా’, ‘దే దానా దాన్’, ‘రే రగిలే’, ‘బాడ్ న్యూస్’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ చాలా ఫెమస్.. సినిమాలతో కంటే ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలిచింది. అన్నట్లు నేహా ధూపియా కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించింది. తరుణ్ నిన్నే ఇష్టపడ్డానులో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. రాజశేఖర్ విలన్ లో హీరోయిన్ గా నటించింది. అలాగే బాలకృష్ణ పరమ వీర చక్ర సినిమాలోనూ ఓ కీలక పాత్రలో మెరిసింది. ఆతర్వాత తెలుగులో నటించలేదు నేహా.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఇదెక్కడి మేకోవర్ రా మావ..! సూర్య ఎత్తుకున్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..

2018 మే 10న నేహా ధూపియా, అంగద్ బేడీ గురుద్వారాలో వివాహం చేసుకున్నారు. తాను పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కావడంతో హడావుడిగా పెళ్లి జరిగిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో నేహా చెప్పుకొచ్చింది. పెళ్లికి ముందే గర్భం దాల్చడంతో.. తల్లి తండ్రుల ఒత్తిడితో 72 గంటల్లోనే ప్రియుడిని పెళ్లి చేసుకున్నా అని తెలిపింది. పెళ్లయిన ఆరు నెలలకే మొదటి బిడ్డకు జన్మనిచ్చింది నేహా. దాంతో ఆమె పై ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు.. నేను పెళ్ళికి ముందే నేను తల్లి అయ్యా.. అందులో తప్పేముంది. నేను మాత్రమే కాదు పెళ్ళికి ముందే గర్భం తెచ్చుకున్నవారు చాలా మంది ఉన్నారు అని చెప్పుకొచ్చింది నేహా ధూపియా.

ఇది కూడా చదవండి :నా భర్తకు తొమ్మిది మందితో ఎఫైర్.. మొత్తం బయటపెట్టిన సీరియల్ నటి

View this post on Instagram

A post shared by Neha Dhupia (@nehadhupia)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us