ఆ హీరో మామూలోడు కాదు.. ఆయనలాంటి వాడు మరొకరు ఉండరు.. అంత మంచి వ్యక్తి
టాలీవుడ్ లో ఎంతో మంది కమెడియన్స్ ఉన్నారు. సినిమా ఏదైనా సరే కామెడీ లేకుంటే ఆ సినిమా ప్రేక్షకులను అంతగా రంజింపలేదు.. రీసెంట్ డేస్ లో హీరోలే కామెడీ చేసి నవ్వులు పూయిస్తున్నారు. సినిమా ఎలాంటిదైనా సరే హీరోలే కామెడీ చేస్తున్నారు. ఒకప్పుడు ఎంతో మంది కమెడియన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మెప్పిస్తున్నారు.

సీనియర్ నటుడు చిట్టిబాబు గుర్తున్నారా.? ప్రముఖ నటుడు రాజబాబు తమ్ముడే చిట్టిబాబు. ఒకప్పుడు కమెడియన్ గా సినిమాలు చేసిన చిట్టి బాబు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి కొన్ని ఆసక్తికరమైన జ్ఞాపకాలను పంచుకున్నారు. కృష్ణ గారిని తెల్ల కాగితం లేదా ప్లెయిన్ వాటర్ అని చెప్పుకొచ్చారు చిట్టిబాబు. బయటే కాదు లోపల కూడా స్వచ్ఛంగా, కల్మషం లేకుండా ఉంటారని చిట్టిబాబు పేర్కొన్నారు. అహంభావం లేని వ్యక్తిగా, ఎదుటివారు తనను పొరపాటుగా అపార్థం చేసుకుంటే కూడా సరదాగా నవ్వి వదిలేసేవారని తెలిపారు. కృష్ణ గారిలో గొప్ప ప్రతిభ, లోతైన జ్ఞానం దాగి ఉండేవని చిట్టిబాబు అన్నారు. ఈస్ట్ గోదావరి జిల్లాలోని సర్పవరం అనే చిన్న గ్రామంలో ఉన్న 650 మంది కెపాసిటీ థియేటర్‌ను కూడా ఆయన ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడం కృష్ణ గారి అసాధారణ జ్ఞాపకశక్తికి, సినిమా వ్యాపారంపై ఆయనకున్న పట్టుకు నిదర్శనమని చిట్టిబాబు తెలిపారు.
ఇది కూడా చదవండి : Folk Song: ఎంతో అదృష్టం చేసుకుంటే నాకు ఆ పాట వచ్చింది.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్
తన సొంత చిత్రాల గురించి అయినా, ఇతర చిత్రాల గురించి అయినా ఆయన స్పష్టమైన అంచనాలను కలిగి ఉండేవారని, ఒక చిత్రం బాగుంటే 100 రోజులు ఆడుతుందని, మరో చిత్రం ప్లాప్ అయితే పోయిందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవారని చిట్టిబాబు గుర్తుచేసుకున్నారు. డ్రాప్ అయిన సినిమా కూడా కొన్నాళ్లకు పుంజుకుంటుందని ప్రోత్సాహం కూడా ఇచ్చేవారని తెలిపారు. కృష్ణ గారు సినిమా షూటింగ్‌ల సమయంలో నిర్మాతగా ఆర్థిక విషయాలు, భోజనాల ఏర్పాట్లు వంటి వాటి గురించి ఏమాత్రం పట్టించుకునేవారు కాదని చిట్టిబాబు వెల్లడించారు. ఆయన హీరోగా తన పాత్రకు మాత్రమే కట్టుబడి ఉండేవారని, మిగిలిన బాధ్యతలను ఆయన తమ్ములు బంగారయ్య, హనుమంతరావు వంటి వారికి అప్పగించేవారని తెలిపారు చిట్టిబాబు. కృష్ణ గారి మానవత్వం, సిబ్బంది పట్ల ఆయనకున్న శ్రద్ధకు ఒక ఉదాహరణగా, చిట్టిబాబు తన అన్నయ్య రాజబాబు గారు చెప్పిన సంఘటనను గుర్తుచేసుకున్నారు.
ఇది కూడా చదవండి : ఇదెక్కడి మేకోవర్ రా మావ..! సూర్య ఎత్తుకున్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
సీతారామరాజు చిత్రం షూటింగ్ రంపచోడవరం అడవులలో జరుగుతుండగా, తీవ్రమైన చలికి సిబ్బంది, జూనియర్ ఆర్టిస్టులు చాలా ఇబ్బంది పడ్డారని రాజబాబు గారు కృష్ణ గారికి తెలిపారట. రాజబాబు చెప్పగానే వెంటనే, కృష్ణ గారు తక్షణమే స్పందించి, హైదరాబాద్ నుండి 200 దుప్పట్లను తెప్పించి సిబ్బందికి అందజేశారట. కృష్ణ గారు ఎంత తెల్లగా, అందంగా ఉంటారో, ఆయన మనసు కూడా లోపల అంతే స్వచ్ఛంగా ఉంటుందని, ఆయన ఒక పాలరాతి బొమ్మ లాంటి నిష్కల్మషమైన వ్యక్తి అని చిట్టిబాబు కృష్ణని ప్రశంసించారు. ఆయన వ్యక్తిత్వం ప్యూర్ వైట్ పేపర్ లాంటిదని చిట్టిబాబు చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి :నా భర్తకు తొమ్మిది మందితో ఎఫైర్.. మొత్తం బయటపెట్టిన సీరియల్ నటి
23 Years for Superstar #Krishna garu, Prema starrer Successful Mass Entertainer #AdirindiGuru Directed by Sagar (27/03/1997) pic.twitter.com/tVI6lUxun3
— BA Raju’s Team (@baraju_SuperHit) March 27, 2020
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




