AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH Vs MI: ఆ ప్లేయర్‌ను ముంబై నుంచి తరిమేయండి.. జట్టుకు పట్టిన దరిద్రం అతడే..

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వ్యూహాలపై సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశారు. ఇంపాక్ట్ ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ సేవలను వినియోగించుకోకపోవడం ముంబై ఓటమికి ప్రధాన కారణమని స్పష్టం చేశారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

SRH Vs MI: ఆ ప్లేయర్‌ను ముంబై నుంచి తరిమేయండి.. జట్టుకు పట్టిన దరిద్రం అతడే..
Srh Vs Mi
Ravi Kiran
|

Updated on: Apr 30, 2026 | 1:01 PM

Share

నిన్నటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైన తీరుపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనను వాడుకోవడంలో హార్దిక్ పాండ్యా పూర్తిగా విఫలమయ్యాడని ఆయన అభిప్రాయపడ్డారు. శార్దూల్ ఠాకూర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా మైదానంలోకి తెచ్చినప్పటికీ, అతడితో ఒక్క ఓవర్ కూడా వేయించకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. నిజానికి బౌలర్లు బుమ్రా నుంచి అశ్విన్ వరకు అందరూ పరుగులు ఇస్తున్నప్పుడు, వికెట్లు తీయగల సామర్థ్యం ఉన్న శార్దూల్‌ను పక్కన పెట్టడం కెప్టెన్ మూర్ఖత్వమే అని గవాస్కర్ ఘాటుగా విమర్శించారు. శార్దూల్ ఠాకూర్ తన కెరీర్‌లో ఎన్నోసార్లు క్లిష్ట సమయాల్లో జట్టుకు బ్రేక్ త్రూ అందించిన ఆటగాడు.

అలాంటి అనుభవం ఉన్న బౌలర్‌ను కేవలం ఫీల్డింగ్‌కు పరిమితం చేయడం ముంబై వ్యూహాల్లోని లోపాన్ని ఎత్తిచూపుతోంది. ఐపీఎల్ చరిత్రలోనే బ్యాటింగ్ చేయకుండా, బౌలింగ్ వేయకుండా మిగిలిపోయిన తొలి ఇంపాక్ట్ ప్లేయర్‌గా శార్దూల్ నిలిచిపోవడం గమనార్హం. ఒక కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా తన అవకాశాలను సరిగ్గా వాడుకోలేకపోయాడు. కేవలం వ్యూహాల లోపం వల్లే ముంబై ఈ మ్యాచ్‌ను చేజార్చుకుందని స్పష్టమవుతోంది. రానున్న మ్యాచ్‌ల్లోనైనా ఇలాంటి తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటారో లేదో చూడాలి.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ సిక్సర్ల హోరును అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్, ఓపెనర్ రియాన్ రికెల్టన్ అద్భుత సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. సాధారణంగా ఇంత పెద్ద స్కోరు ఛేదించడం కష్టమని అందరూ భావించారు, కానీ సన్‌రైజర్స్ బ్యాటర్లు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగారు. సన్‌రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (76), అభిషేక్ శర్మ (45) పవర్ ప్లేలోనే 92 పరుగులు రాబట్టి విజయానికి గట్టి పునాది వేశారు. అనంతరం హెన్రిచ్ క్లాసెన్ కేవలం 30 బంతుల్లోనే 65 పరుగులు చేసి ముంబై బౌలర్లను ఉతికేసాడు. చివరికి మరో 8 బంతులు మిగిలి ఉండగానే సన్‌రైజర్స్ ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించి, ఈ సీజన్‌లో వరుసగా ఐదవ విజయాన్ని నమోదు చేసింది.

Also Read: నమ్మకం పోయింది.! SRH బ్యాటర్లు కొడుతుంటే.. మా ఫ్యాన్స్ కూడా వాళ్లకే జేజేలు కొడుతున్నారు..

Follow Us