AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: 17 బాలుడితో ఎఫైర్ పెట్టుకున్న 37 ఏళ్ల వివాహిత.. భర్త, అత్తను చంపేందుకు స్కెచ్.. చివరకు

చిత్తూరులో 17 ఏళ్ల మైనర్ బాలుడితో వివాహేతర సంబంధం కొనసాగించిన 37 ఏళ్ల మహిళ, భర్తతో పాటు అత్తను చంపేందుకు ప్లాన్ చేసిన ఘటన కలకలం రేపింది. అత్తపై మైనర్ దాడి చేయగా ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మహిళ కోసం గాలిస్తున్నారు.

Andhra: 17 బాలుడితో ఎఫైర్ పెట్టుకున్న 37 ఏళ్ల వివాహిత.. భర్త, అత్తను చంపేందుకు స్కెచ్.. చివరకు
Kavitha
Raju M P R
| Edited By: |

Updated on: Feb 07, 2026 | 8:41 AM

Share

చిత్తూరులో ఓ 37 ఏళ్ల వివాహిత బరితెగింపు ఘటన వెలుగు చూసింది. 17 ఏళ్ల మైనర్ బాలుడితో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ, అతనితో ఉన్న వ్యామోహంతో ఏకంగా భర్త, అత్తను చంపేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా చామంతిపురం ప్రాంతానికి చెందిన కవిత (37)కు అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలుడితో కొంతకాలంగా పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధంగా మారినట్లు సమాచారం. కవితకు 17 ఏళ్ల క్రితం వివాహం కాగా, 15 ఏళ్ల వయస్సున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ వివాహేతర సంబంధం విషయం తెలుసుకున్న భర్త విజయ్‌కుమార్ పలుమార్లు ఆమెను మందలించాడు. దీంతో భర్త విజయ్‌కుమార్, అత్త నిర్మల ఇద్దరూ అడ్డుగా ఉన్నారని భావించిన కవిత, వారిని చంపేయాలని మైనర్ బాలుడిని రెచ్చగొట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న నిర్మలపై మైనర్ బాలుడు దాడికి పాల్పడ్డాడు. ఆమె కళ్లల్లో కారం కొట్టి, వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. అయితే నిర్మల కేకలు వేయడంతో బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిర్మలని స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఘటన అనంతరం కవిత పరారీలో ఉండగా, మైనర్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన చిత్తూరు వన్‌టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టి, పరారీలో ఉన్న కవిత కోసం గాలిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..