AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cleaning Tips: గ్యాస్ బర్నర్‌ మురికిగా మారిందా.. ఇలా క్లీన్ చేస్తే.. క్షణాల్లో కొత్తదానిలా మెరవాల్సిందే!

ఇప్పుడు ముందే దేశంలో గ్యాస్ కొతర ఉంది. కాబట్టి గ్యాస్‌ను పొదుపుగా వాడుకోవడం చాలా అవసరం. అయితే కొంత మంది కిచెన్‌లో వంటచేసేప్పుడు కూరగాయలు గ్యాస్ బర్నర్‌లపై పడి వాటి రంద్రాలు మూసుకుపోతాయి. దీని వల్ల సరిగ్గా మంట రాదు. తద్వారా గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి మురికిగా మారిన గ్యాస్ బర్నర్‌ పాడేసి కొత్తవి కొనకుండా.. ఉన్న వాటినే క్షణాల్లో కొత్త వాటిలా ఎలా మార్చుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

Cleaning Tips: గ్యాస్ బర్నర్‌ మురికిగా మారిందా.. ఇలా క్లీన్ చేస్తే.. క్షణాల్లో కొత్తదానిలా మెరవాల్సిందే!
Gas Burner Cleaning
Anand T
|

Updated on: May 19, 2026 | 2:55 PM

Share

రోజూ వంట చేసేటప్పుడు పాలు, చాయ్ లేదా కూరలు పొంగి బర్నర్‌పై పడుతుంటాయి. నూనె, మసాలాల జిడ్డు మెల్లగా ఆ రంధ్రాలలో పేరుకుపోవడం వల్ల గ్యాస్ ఫ్లో తగ్గిపోతుంది. అందుకే మంట సరిగ్గా వెలగదు. ఇలా జరిగినప్పుడు, కొందరు వెంటనే బర్నర్‌ను మార్చి కొత్తది కొనాలని చూస్తారు. కానీ మన ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతో పాతవాటిని క్షణాల్లో కొత్త వాటిగా మార్చి సమస్యను పరిష్కరించుకోవచ్చని చాలా మందికి తెలియదు. కాబట్టి సింపుల్‌గా ఇంట్లోనే గ్యాస్ బర్నర్‌ను ఎలా శుభ్రం చేయాలో స్టెప్‌బై స్టెప్ ఇక్కడ తెలుసుకుందాం.

గ్యాస్ బర్నర్‌ను ఇంట్లోనే ఎలా శుభ్రం చేయాలి?

ముందుగా, గ్యాస్‌ను ఆపివేయండి: గ్యాస్ బర్నర్‌ను శుభ్రం చేసే ముందు, గ్యాస్ రెగ్యులేటర్‌ను ఆపివేయండి. ఒక వేళ మీరు అప్పుడే వంట చేసి ఉంటే అవి చల్లారే దాక ఆగండి. ఎందుకంటే ఆ వేడి బర్నర్‌ను అలాగే పట్టుకుంటే చేతులు కాలే అవకాశం ఉంటుంది. కాబట్టి చల్లారాక మాత్రమే వాటిని పట్టుకోండి.

వేడి నీరు, నిమ్మకాయను: గ్యాస్ బర్నర్‌ను శుభ్రం చేయడానికి, ఒక పాత్రలో వేడి నీటిని తీసుకుని, అందులో ఒక నిమ్మకాయ రసం, కొద్దిగా బేకింగ్ సోడా కలిపి ఒక ద్రావణాన్ని తయారు చేయండి. ఈ ద్రావణాన్ని బర్నర్‌పై పోసి 15 నుండి 20 నిమిషాల పాటు నాననివ్వండి.

టూత్‌బ్రష్‌తో శుభ్రం చేయండి: ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న పాత టూత్‌బ్రష్ లేదా స్క్రబ్బర్‌ తీసుకొని ఆ బర్నర్‌కు ఉన్న మురికిని రుద్దండి. బర్నర్‌లోని చిన్న రంధ్రాలను శుభ్రం చేయడానికి పిన్ను లేదా సూదిని ఉపయోగించండి, కానీ ఎక్కువ బలాన్ని ప్రయోగించకుండా జాగ్రత్త వహించండి, ఎందుకంటే ఇది రంధ్రాలు పెద్దవి కావడానికి కారణం కావచ్చు.

వెనిగర్‌తో మొండి మరకలను తొలగించండి: మీ గ్యాస్ బర్నర్ బాగా నల్లగా మారినట్లయితే, దానిపై కొద్దిగా తెల్ల వెనిగర్ పోసి ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత, బ్రష్‌తో రుద్ది, శుభ్రమైన నీటితో కడగండి. తర్వాత ఒక పొడి గుడ్డ తీసుకొని బర్నర్‌ను తడిలేకుండా తుడవండి. అంతే మీ బర్నర్ క్షణాల్లో తలతలా మెరుస్తోంది.

బర్నర్‌ను ఆరబెట్టడం చాలా ముఖ్యం: అయితే కడిగిన వెంటనే చాలా మంది బర్నర్‌ను స్టవ్‌పై పెడతారు. కానీ ఇలా చేయడం తప్పు. ముందుగా, దానిని పొడి గుడ్డతో తుడిచి ఆరనివ్వండి. తడిగా ఉన్న బర్నర్‌ను ఉపయోగించడం వల్ల గ్యాస్ సరిగ్గా మండదు. పూర్తిగా తుడిచిన తర్వాతే దాన్ని సిలిండర్‌పై ఉంచండి.

ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి:

  • వారానికి ఒకసారైనా బర్నర్లను పైపైన క్లీన్ చేస్తూ ఉండండి.
  • పాలు లేదా వంటకాలు పొంగినప్పుడు వెంటనే తుడిచేయండి.
  • రంధ్రాలు సాఫ్ చేయడానికి మరీ లావుగా ఉండే సూదులను వాడకండి.
  • క్లీనింగ్ పూర్తయ్యాక బర్నర్‌ను స్టవ్‌పై సరిగ్గా అమర్చండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us