AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యాయం కోసం వెళ్తే.. గర్భవతిని చేసిన సీఐ.. తెలంగాణలో సంచలనం..

భర్త వేధింపులపై న్యాయం కోరుతూ మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ వివాహితను సీఐ ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసిన ఘటన ఖమ్మంలో సంచలనం రేపింది. గర్భవతిని చేసి అబార్షన్‌కు బలవంతం చేశాడని బాధితురాలు ఆరోపించడంతో సీఐ రాజు నాయక్‌పై కేసు నమోదైంది. ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.

న్యాయం కోసం వెళ్తే.. గర్భవతిని చేసిన సీఐ.. తెలంగాణలో సంచలనం..
Crime News
N Narayana Rao
| Edited By: |

Updated on: May 19, 2026 | 1:57 PM

Share

భర్త వేధిస్తున్నాడని న్యాయం చేయాలని ఓ మహిళ.. మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.. అయితే.. ఆ మహిళ పై కన్నేసిన సీఐ న్యాయం చేస్తానంటూ దగ్గరయ్యాడు.. ప్రేమ, పెళ్లి పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.. గర్భవతిని చేశాడు.. పెళ్లి గురించి అడిగితే టాబ్లెట్లు మింగించి అబార్షన్ చేయించాడు.. వివాహితపై వేధింపులకు పాలడ్డ సిసిఎస్ సిఐ రాజుపై కేసు నమోదవ్వడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఖమ్మం కమిషనరేట్‌లో పనిచేస్తున్న సీఐ భూక్యా రాజు నాయక్‌ను పోలీసు ఉన్నతాధికారులు హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఈ ఖమ్మంలో జరిగిన ఈ ఘటన తెలంగాణలో కలకలం రేపింది.

వివరాల ప్రకారం..

వివాహిత మహిళను వేధించిన వ్యవహారంలో ఖమ్మం CCS స్టేషన్ CI బానోత్ రాజుపై ఖమ్మం 2టౌన్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.. 2023లో ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్‌లో రాజు నాయక్ సీఐగా ఉండగా ఓ మహిళ తన భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు నుంచి ఫోన్ నంబర్ తీసుకున్న సీఐ, న్యాయం చేస్తానని నమ్మించి తరచూ ఫోన్లు, మెసేజ్‌లు చేయడం ప్రారంభించాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెను లోబర్చుకున్నాడు. ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చడంతో తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. అయితే, సీఐ ఆమెకు బలవంతంగా కొన్ని ట్యాబ్లెట్లు మింగించడంతో గర్భస్రావం అయిందని బాధితురాలు పేర్కొంది.

ఆ తర్వాత కూడా పెళ్లి విషయాన్ని దాటవేస్తుండటంతో.. బాధితురాలు ఈనెల 7న ఖమ్మం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో సీఐ వేధింపులకు పాల్పడినట్లు తేలడంతో ఉన్నతాధికారులు అతన్ని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.

కాగా.. బాధితురాలికి ఇటీవలే ఆమె భర్త నుంచి కోర్టు ద్వారా విడాకులు మంజూరయ్యాయి. ఆమెకు విడాకులు ఇప్పించేందుకు సీఐ రాజు నాయక్ ఆమె భర్తపై ఒత్తిడి తెచ్చినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

Follow Us