AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యాన్స్‌కు షాక్.. గంభీర్ స్కెచ్‌లో అడ్డంగా బుక్కైన రోహిత్.. కట్‌చేస్తే.. 2027 ప్రపంచకప్ నుంచి ఔట్?

Rohit Sharma ODI Future: భారత క్రికెట్ అభిమానులకు అత్యంత దిగ్భ్రాంతికరమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. టీమిండియా మాజీ సారథి, బౌండరీల రారాజు రోహిత్ శర్మ వన్డే కెరీర్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల నుంచి రోహిత్‌ను తప్పించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భావిస్తుండటంతో, అతడి భవిష్యత్తుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఫ్యాన్స్‌కు షాక్.. గంభీర్ స్కెచ్‌లో అడ్డంగా బుక్కైన రోహిత్.. కట్‌చేస్తే.. 2027 ప్రపంచకప్ నుంచి ఔట్?
Rohit Sharma Odi Career
Venkata Chari
|

Updated on: May 19, 2026 | 2:49 PM

Share

2027 Cricket World Cup India Selection: ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే భారత జట్టు అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసమే సెలెక్టర్లు త్వరలో భేటీ కానున్నారు. అయితే ఈ సమావేశంలో కేవలం అఫ్గానిస్తాన్ సిరీస్ జట్టును ఎంపిక చేయడమే కాకుండా, రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ కోసం ఒక పక్కా వ్యూహాన్ని సిద్ధం చేయనున్నారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కమిటీ భవిష్యత్తు జట్టుపై కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మను అఫ్గానిస్తాన్ సిరీస్ నుంచి పక్కన పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం.

హిట్‌మ్యాన్ కొంపముంచిన ఫిట్‌నెస్ సమస్యలు..

ఇప్పటికే టెస్టులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్ లో మాత్రమే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే, 39 ఏళ్ల వయసులో అతడి ఫిట్‌నెస్ ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతాపై 78 పరుగులతో అద్భుతంగా ఆరంభించినప్పటికీ, ఆ తర్వాత బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ పిక్క కండరాల గాయానికి (హామ్‌స్ట్రింగ్) గురయ్యాడు. దీనివల్ల సీజన్‌లో సగానికి పైగా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ముంబై ఇండియన్స్ జట్టు అతడిని కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే ఆడించాల్సి వచ్చింది.

ఇది కూడా చదవండి: CSK vs SRH IPL 2026 Result: కీలక పోరులో ఓడిన చెన్నై.. ప్లేఆఫ్స్ చేరిన హైదరాబాద్, గుజరాత్

ఇవి కూడా చదవండి

గంభీర్, అగార్కర్ ద్వయం కఠిన వ్యూహాలు..

కొత్త కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ జట్టులో సీనియారిటీ కంటే ఫిట్‌నెస్, చురుకుదనానికే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఫీల్డింగ్, రన్నింగ్ అత్యంత కీలకం కాబట్టి, రాబోయే ప్రపంచకప్ నాటికి 40 ఏళ్లు దాటే రోహిత్ శర్మను జట్టులో కొనసాగించడం అంత శ్రేయస్కరం కాదని వారు భావిస్తున్నారు. మరోవైపు, అదే వయసున్న విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో అద్భుతమైన ఫామ్, అత్యుత్తమ ఫిట్‌నెస్‌తో దూసుకుపోతుండటంతో అతడి స్థానానికి ఎలాంటి ఢోకా లేదు. కానీ రోహిత్ విషయంలో మాత్రం సెలెక్టర్లు మొగ్గు చూపడం లేదు.

ప్రపంచకప్ ఆడాలన్న రోహిత్ కల చెదిరిపోయేనా?

కొద్దిరోజుల క్రితమే రోహిత్ శర్మ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, తనకు వన్డే ప్రపంచకప్ గెలవాలనే కసి ఇంకా బలంగా ఉందని, అందుకోసం ఎంతగానైనా శ్రమిస్తానని ప్రకటించాడు. అయితే దేశవాళీ క్రికెట్ ఆడి తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటేనే రోహిత్ పేరును పరిశీలించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ సెలెక్టర్లు యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని భావిస్తే, హిట్‌మ్యాన్ సుదీర్ఘ వన్డే ప్రయాణానికి ఇక్కడితో తెరపడినట్లేనని క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇది కూడా చదవండి: MS Dhoni: ఫైనల్ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి ధోని.. వీడ్కోలుకు సిద్ధమైన ఫ్యాన్స్..?

భారత క్రికెట్‌కు ఎన్నో చారిత్రాత్మక విజయాలను అందించిన రోహిత్ శర్మ భవిష్యత్తుపై బీసీసీఐ తీసుకోబోయే నిర్ణయం అభిమానులకు మింగుడుపడటం లేదు. గాయాలు, వయసు ప్రభావం కారణంగా ఒక గొప్ప ఆటగాడిని పక్కన పెట్టాల్సి రావడం బాధాకరమే అయినప్పటికీ, జట్టు భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయాలు తప్పవని యాజమాన్యం భావిస్తోంది. మరి సెలెక్టర్ల తుది నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us