AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varanasi: మార్పుల్లేవు.. వారణాసిలో అది ఫిక్స్..! ఎలా ముగిస్తారోనని ఫ్యాన్స్ టెన్షన్

Varanasi: మార్పుల్లేవు.. వారణాసిలో అది ఫిక్స్..! ఎలా ముగిస్తారోనని ఫ్యాన్స్ టెన్షన్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 18, 2026 | 7:42 PM

Share

రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ టీజర్ విడుదలైన తర్వాత ఈ సినిమా ఒక్క పార్ట్‌లో పూర్తవుతుందా అనే చర్చ మొదలైంది. టైమ్ ట్రావెల్, రామాయణ అంశాలు, భారీ విజువల్స్‌తో కథ విస్తృతి అర్థమవుతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. బాహుబలి తర్వాత రెండు భాగాల ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన జక్కన్న.. ఈసారి మాత్రం ఎంత పెద్ద కథైనా ఒకే పార్ట్‌లో చెప్పనున్నట్టు స్పష్టం చేశారు.

బడ్జెట్ పెరిగినా.. కథ స్పాన్ పెరిగినా ఒకప్పుడు నిర్మాతలకు కంగారు ఎక్కువయ్యేది. కానీ ఇప్పుడలా కాదు.. సింపుల్‌గా ఒక సినిమాను రెండు భాగాలు చేస్తున్నారు.. అడిగితే కథ పెద్దదైపోయిందంటున్నారు. దీన్ని స్టార్ట్ చేసిందే రాజమౌళి. RRR సింగిల్ పార్ట్‌గానే ముగించిన ఈయన.. వారణాసిని ఏం చేయబోతున్నారు..? ఇంత పెద్ద కథను సింగిల్ పార్ట్‌లో చెప్పగలరా..? అసలేం జరుగుతుంది..? బాహుబలితో ఇండియన్ సినిమాకు 2 పార్ట్ కల్చర్ పరిచయం చేశారు రాజమౌళి.. ఆ తర్వాత చాలా సినిమాలు 2 భాగాలుగా వచ్చాయి.. ఇంకా వస్తున్నాయి కూడా. ఓ రకంగా నిర్మాతలకు ధైర్యాన్నిచ్చిన ట్రెండ్ ఇది. కానీ దీన్ని ట్రిపుల్ ఆర్‌కు కంటిన్యూ చేయలేదు జక్కన్న. 3 గంటలైనా ఒకే సినిమాతో ఈ కథను ముగించారు. ఇద్దరు స్టార్ హీరోలున్నా కూడా ట్రిపుల్ ఆర్ కథను పర్ఫెక్టుగానే ముగించారు రాజమౌళి. తాజాగా ఈయన ఫోకస్ అంతా వారణాసి సినిమాపైనే ఉంది. ఇన్నాళ్లూ ఈ సినిమాను ఒకే పార్ట్‌లో చెప్తారనుకున్నారు ఆడియన్స్. మేకర్స్ ఇప్పటికీ అదే చెప్తున్నారు కూడా.. టీజర్ చూశాక ఇంత పెద్ద సినిమాను ఒకే పార్ట్‌లో రాజమౌళి చెప్పగలరా అనే అనుమానాలు వస్తున్నాయి. వారణాసి షూటింగ్‌ను అంటార్కిటికా సహా చాలా ఖండాలు, దేశాల్లో చేస్తున్నారు జక్కన్న. ఆయన చెప్పాలనుకున్న కథ చాలా భారీగా ఉండబోతుందని టీజర్‌తోనే క్లారిటీ వచ్చింది. టైమ్ ట్రావెల్‌తో పాటు చాలా విషయాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ఇందులో రామాయణంతో పాటు చాలా విషయాలున్నాయి.. వారణాసిలో మొదలై అక్కడే ముగిసే కథ ఇది. అందుకే టైటిల్ కూడా అదే పెట్టారు. రాజమౌళి విజన్, వీడియో చూసాక.. ఈ కథను ప్రాపర్ రెండున్నర గంటల్లో అయితే చెప్పలేరు.. 3 గంటలు కూడా తక్కువే. బాహుబలి ఎపిక్‌లా 3.45 గంటలైనా కావాల్సిందే. రాజమౌళి కూడా 3.45 గంటలైనా పర్లేదు కానీ ఒకే పార్ట్‌లోనే చెప్తామని మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉత్తర కొరియా ఫోన్ల వెనుక భయంకర నిజాలు.. ప్రతి 2 నిమిషాలకు స్క్రీన్‌షాట్

Hair Clips: హెయిర్ క్లిప్స్‌తో జుట్టుకు ప్రమాదం! నిపుణులు చెప్పిన అసలు నిజం ఇదే

సముద్రం అడుగున ప్రపంచంలోనే.. అతిపెద్ద జలపాతం

కొన్ని దేశాల్లో పాములు ఎందుకు ఉండవు ??

కింద పడ్డ మామిడికాయలు ఏరుకుంటే.. అంత పెద్ద శిక్షా?

Follow Us