AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Clips: హెయిర్ క్లిప్స్‌తో జుట్టుకు ప్రమాదం! నిపుణులు చెప్పిన అసలు నిజం ఇదే

Hair Clips: హెయిర్ క్లిప్స్‌తో జుట్టుకు ప్రమాదం! నిపుణులు చెప్పిన అసలు నిజం ఇదే

Phani CH
|

Updated on: May 18, 2026 | 6:30 PM

Share

మహిళల్లో ట్రెండ్‌గా మారిన క్లా క్లిప్స్ జుట్టుకు హానికరమా అనే సందేహాలకు నిపుణులు క్లారిటీ ఇచ్చారు. క్లిప్స్ కంటే వాటిని వాడే విధానమే ముఖ్యమని చెబుతున్నారు. నాణ్యమైన మెటీరియల్‌తో చేసిన క్లిప్స్ వాడటం, ఒకే చోట నిరంతరం పెట్టకపోవడం, తడి జుట్టుకు క్లిప్స్ ఉపయోగించకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని సూచిస్తున్నారు.

ప్రస్తుతం మహిళల్లో క్లా క్లిప్స్ వాడకం ఒక ట్రెండ్‌గా మారింది. స్టైలిష్‌గా, సౌకర్యవంతంగా ఉండటంతో కాలేజీ విద్యార్థినుల నుంచి ఉద్యోగినుల వరకు అందరూ వీటినే ఇష్టపడుతున్నారు. అయితే, ఈ క్లిప్స్ వాడటం వల్ల జుట్టు దెబ్బతింటుందనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. దీనిపై శాస్త్రీయ కోణంలో పరిశీలిస్తే, క్లిప్స్ వాడకం కంటే అవి వాడే పద్ధతిలోనే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ సైన్స్ జర్నల్ నివేదికల ప్రకారం… జుట్టుపై ఒకే చోట నిరంతరం ఒత్తిడి పడటం వల్ల ఆ ప్రాంతంలో వెంట్రుకలు బలహీనపడి విరిగిపోతాయి. అయితే, ఎలాస్టిక్ బ్యాండ్లతో పోలిస్తే క్లా క్లిప్స్ కొంత వరకు నయం అంటున్నారు. ఎలాస్టిక్స్ జుట్టును గట్టిగా లాగి పట్టి ఉంచితే, క్లా క్లిప్స్ ఒత్తిడిని సమానంగా పంచుతాయి. కానీ, నాణ్యత లేని మెటల్ లేదా గరుకైన ప్లాస్టిక్ క్లిప్స్ వాడటం వల్ల జుట్టు కుదుళ్లకు హాని కలిగే అవకాశం ఉంది. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ క్లిప్స్ వాడాలనుకునే వారికి కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు. ముఖ్యంగా గరుకైన ప్లాస్టిక్ బదులు ‘స్మూత్ యాసిటేట్’ మెటీరియల్‌తో చేసిన క్లిప్స్ ఎంచుకోవాలి. జుట్టు పరిమాణానికి తగిన సైజు క్లిప్ వాడటం, రోజూ ఒకే చోట కాకుండా క్లిప్ పెట్టే ప్రదేశాన్ని మారుస్తూ ఉండటం మంచిది. అలాగే, జుట్టు తడిగా ఉన్నప్పుడు క్లిప్స్ అస్సలు వాడకూడదని, ఆ సమయంలో జుట్టు చాలా బలహీనంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, జుట్టు పూర్తిగా ఆరిన తర్వాతే క్లిప్స్ వాడాలి. సరైన పద్ధతి పాటిస్తే ఈ క్లిప్స్ జుట్టుకు సురక్షితమే అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సముద్రం అడుగున ప్రపంచంలోనే.. అతిపెద్ద జలపాతం

కొన్ని దేశాల్లో పాములు ఎందుకు ఉండవు ??

కింద పడ్డ మామిడికాయలు ఏరుకుంటే.. అంత పెద్ద శిక్షా?

తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండలు.. మరో 4 రోజుల పాటు సూర్యుడి విశ్వరూపం

Follow Us