కొన్ని దేశాల్లో పాములు ఎందుకు ఉండవు ??
ప్రపంచంలోని కొన్ని దేశాల్లో సహజసిద్ధంగా పాములు కనిపించవు. న్యూజిలాండ్, ఐర్లాండ్, ఐస్‌లాండ్, గ్రీన్‌ల్యాండ్ వంటి ప్రాంతాల్లో చల్లని వాతావరణం, భౌగోళిక ఏకాంతం కారణంగా పాములు మనుగడ సాగించలేకపోయాయి. పాముల భయంతో బాధపడేవారికి ఈ దేశాలు స్వర్గధామాలుగా భావిస్తున్నారు. ప్రకృతి వింతలలో ఇది కూడా ఒక ఆసక్తికరమైన అంశంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో సహజసిద్ధంగా పాములు కనిపించవు. ప్రకృతిలోని ఈ వింతకు భౌగోళిక, వాతావరణ పరిస్థితులే కారణాలు. ఓఫిడియోఫోబియాతో బాధపడే పర్యాటకులకు ఆ దేశాలు స్వర్గధామంగా మారాయి. ప్రపంచంలో పాములు లేని దేశం అనగానే చాలామందికి వెంటనే న్యూజిలాండ్ గుర్తొస్తుంది. కానీ ఆ జాబితాలో న్యూజిలాండ్ మాత్రమే లేదు. ఐర్లాండ్, ఐస్‌లాండ్, గ్రీన్‌ల్యాండ్ ఉన్నాయి. పాములు శీతల రక్త జంతువులు. అంటే, తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి బయటి వాతావరణంపై ఆధారపడతాయి. అందుకే ఐస్‌లాండ్, గ్రీన్‌ల్యాండ్, అంటార్కిటికా వంటి అతి శీతల ప్రాంతాల్లో అవి మనుగడ సాగించలేవు. మరో ముఖ్య కారణం భౌగోళిక ఏకాంతం. చుట్టూ సముద్రం ఉన్న ద్వీప దేశాలకు వేల ఏళ్ల క్రితం పాములు వలస వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఆ రెండు కారణాల వల్ల కొన్ని దేశాలు పాములకు దూరంగా ఉన్నాయి. పాములు లేని దేశంగా న్యూజిలాండ్ పేరుపొందింది. ఐర్లాండ్‌లో సెయింట్ పాట్రిక్ అనే మత గురువు పాములను దేశం నుంచి తరిమేశాడని పురాణ కథలు ఉన్నప్పటికీ, అది వాస్తవం కాదు. చివరి మంచు యుగం తర్వాత ఏర్పడిన చల్లని వాతావరణం, బ్రిటన్ నుంచి సముద్రం ద్వారా వేరుపడటంతో ఐర్లాండ్‌కు పాములు చేరలేకపోయాయని శాస్త్రవేత్తలు చెబుతారు. ఆఫ్రికా తీరంలోని కేప్ వెర్డె, పసిఫిక్ మహాసముద్రంలోని కుక్ ఐలాండ్స్, టువాలు, కిరిబాటి వంటి ద్వీప దేశాల్లోనూ పాములు కనిపించవు. అమెరికాలోని అలాస్కా, హవాయి రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. న్యూజిలాండ్ సముద్ర జలాల్లో అప్పుడప్పుడు సముద్ర పాములు కనిపిస్తుంటాయి. సముద్ర ప్రవాహాల ద్వారా అవి తీర ప్రాంతాలకు కొట్టుకువస్తాయి. వీటిని పూర్తిగా నిరోధించడం కష్టం. ఏదేమైనా, భూమిపై నిర్భయంగా, పాముల భయం లేకుండా ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి ఈ దేశాలు ఉత్తమ ఎంపిక.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కింద పడ్డ మామిడికాయలు ఏరుకుంటే.. అంత పెద్ద శిక్షా?
తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండలు.. మరో 4 రోజుల పాటు సూర్యుడి విశ్వరూపం
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

