AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సముద్రం అడుగున ప్రపంచంలోనే.. అతిపెద్ద జలపాతం

సముద్రం అడుగున ప్రపంచంలోనే.. అతిపెద్ద జలపాతం

Phani CH
|

Updated on: May 18, 2026 | 6:28 PM

Share

ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతం కంటికి కనిపించకుండా సముద్ర గర్భంలో ఉందని తెలుసా? గ్రీన్‌లాండ్‌, ఐస్‌లాండ్ మధ్య ఉన్న డెన్మార్క్ స్ట్రెయిట్ కాటరాక్ట్ నయాగరా జలపాతంతో పోలిస్తే వందల రెట్లు భారీది. చల్లని నీరు సముద్ర గర్భంలోని లోయలోకి పడిపోతూ ఏర్పడే ఈ అద్భుత జలపాతం ప్రపంచ వాతావరణ సమతుల్యతలో కీలక పాత్ర పోషిస్తోంది.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా నీరు ప్రవహించే జలపాతాలలో నయాగరా ఒకటి. ఈ జలపాతం నుంచి సెకనుకు లక్షలాది లీటర్ల నీరు వేగంగా కిందకు పడుతుంది. నిజానికి నయాగరా జలపాతం ఒకటి కాదు. అది మూడు జలపాతాల సమాహారం. నయాగరా జలపాతం ఉత్తర అమెరికాలో ఉంది. అది కెనడాలోని ఒంటారియో రాష్ట్రానికి అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర బోర్డర్‌లో ఉంటుంది. భూమిపై నయాగరా అతిపెద్ద జలపాతం అనుకుంటాం. కానీ, దానికి వందల రెట్లు పెద్దదైన ఒక మహా జలపాతం మన కళ్లకు కనిపించకుండా ఆర్కిటిక్ మహాసముద్రం అడుగున దాగి ఉంది. దాని పేరు డెన్మార్క్ స్ట్రెయిట్ కాటరాక్ట్. గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్ మధ్య సముద్ర గర్భంలో ఇది నిశ్శబ్దంగా ప్రవహిస్తూ ఉంది. నార్వేజియన్ సముద్రం నుంచి వచ్చే అతి చల్లని, అధిక సాంద్రత కలిగిన నీరు ఉత్తర అట్లాంటిక్ సముద్రం నుంచి వచ్చే వెచ్చని, తక్కువ సాంద్రత కలిగిన నీటిని కలిసి జలపాతంలా మారుతుంది. చల్లని నీరు బరువుగా ఉండటం వల్ల, అది వెచ్చని నీటి కిందకు వేగంగా ప్రవహించేలా చేస్తూ సముద్ర గర్భంలో ఉన్న లోతైన లోయలోకి పడేలా చేస్తుంది. ప్రతి సెకనుకు సుమారు 50 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు కిందకు పడుతుంది. ఇది అమెజాన్ నది సముద్రంలోకి వదిలే నీటి కంటే దాదాపు 200 రెట్లు ఎక్కువ. ఇది మనకు ఎందుకు కనిపించదు అంటే ఇది పూర్తిగా సముద్రం లోపల, నీటి అడుగున జరుగుతుంది కాబట్టి మనం దీన్ని కంటితో చూడలేము. సముద్ర శాస్త్రవేత్తలు కేవలం సెన్సార్ల ద్వారా , సముద్రపు లోతును కొలిచే పరికరాల ద్వారా దీని ఉనికిని గుర్తించారు. సాధారణ జలపాతాల్లా దీనిలోని నీరు పై నుంచి కిందికి పడదు. ఈ ప్రవాహం ఒక సముద్ర గర్భంలోని కొండ లాంటి నిర్మాణం పైనుంచి వేల అడుగుల లోతుకు పడిపోతుంది. దీని వేగం ఎంతంటే, సెకనుకు సుమారు 32 లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని ఇది కిందికి నెడుతుంది. ఇది అమెజాన్ నదీ ప్రవాహం కంటే చాలా ఎక్కువ. ఈ జలపాతం ప్రపంచ వాతావరణాన్ని నియంత్రించే ‘అట్లాంటిక్ సర్క్యులేషన్’ లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సముద్రాలలో ఉష్ణోగ్రత, ఆక్సిజన్, పోషకాలను సరఫరా చేస్తూ యూరప్ వాతావరణాన్ని సమతుల్యం చేస్తుంది. వాతావరణ మార్పుల వల్ల ఆర్కిటిక్ ప్రాంతం వేడెక్కుతుండటంతో ఈ అద్భుత నీటి ప్రవాహంపై ప్రభావం పడుతోందని సైంటిస్ట్‌లు అంటున్నారు. సముద్ర ప్రసరణ వ్యవస్థకు గుండెకాయలాంటి ధ్రువ ప్రాంతాల బలం తగ్గితే వాతావరణం చల్లబడటం, తుపాన్‌ల దిశ మారడం వంటివి జరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వాతావరణ సమతుల్యతను కాపాడటంలో ఈ జలపాతం చాలా ముఖ్యం. ఇది ప్రకృతి సిద్ధంగా సముద్ర గర్భంలో ఏర్పడిన ఒక అద్భుత జలపాతం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొన్ని దేశాల్లో పాములు ఎందుకు ఉండవు ??

కింద పడ్డ మామిడికాయలు ఏరుకుంటే.. అంత పెద్ద శిక్షా?

తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండలు.. మరో 4 రోజుల పాటు సూర్యుడి విశ్వరూపం

Follow Us