AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉత్తర కొరియా ఫోన్ల వెనుక భయంకర నిజాలు.. ప్రతి 2 నిమిషాలకు స్క్రీన్‌షాట్

ఉత్తర కొరియా ఫోన్ల వెనుక భయంకర నిజాలు.. ప్రతి 2 నిమిషాలకు స్క్రీన్‌షాట్

Phani CH
|

Updated on: May 18, 2026 | 6:32 PM

Share

ఉత్తరకొరియాలో ఉపయోగిస్తున్న స్మార్ట్‌ఫోన్లు ప్రజలపై నిరంతర నిఘా పెట్టే పరికరాల్లా పనిచేస్తున్నాయన్న కథనాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ ఫోన్లు ప్రతి రెండు నిమిషాలకు స్క్రీన్‌షాట్లు తీసి భద్రపరుస్తాయని, ప్రభుత్వ వ్యతిరేక పదాలను ఆటోమేటిక్‌గా మార్చేస్తాయని సమాచారం. టెక్నాలజీ ద్వారా ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను నియంత్రిస్తున్నారంటూ అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తర కొరియా అంటేనే ఆంక్షల ప్రపంచం. అక్కడ ప్రజలు స్వేచ్ఛగా ఉండే ఛాన్సుండదు. తాజాగా ఆ దేశంలోని స్మార్ట్‌ఫోన్ల పనితీరుపై వస్తున్న కథనాలు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. సాధారణంగా స్మార్ట్‌ఫోన్లు మన పనులను సులభతరం చేస్తాయి. కానీ ఉత్తరకొరియాలో వాడే ఫోన్లు మాత్రం ప్రజలను వేటాడే వేగుల్లా మారుతున్నాయి. అక్కడ ఉపయోగంలో ఉండే ప్రతీ ఫోన్ వినియోగదారుడి కదలికలను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తూ, ప్రభుత్వానికి సమాచారం చేరవేసే ఒక నిఘా పరికరంలా పనిచేస్తోందన్న ఆరోపణలున్నాయి. యూజర్ ఏం చేస్తున్నాడనేది ఎప్పటికప్పుడు స్క్రీన్ షాట్ల రూపంలో భద్రపరిచి, ప్రభుత్వం తనిఖీ చేసేలా ఈ టెక్నాలజీని డిజైన్ చేశారు. ఇదొక జేబులో ఇమిడిపోయే నిఘా వ్యవస్థలా పనిచేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఫోన్ల ప్రధాన ఉద్దేశం సమాచార మార్పిడి కంటే నిఘా పెట్టడమే. వినియోగదారుడు తనకు తెలియకుండానే నిరంతరం నిఘా నీడలో ఉంటాడు. ఈ ఫోన్లలోని సాఫ్ట్‌వేర్ అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. యూజర్ ఫోన్‌లో ఏం చూస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకునేందుకు ప్రతీ రెండు నిమిషాలకు ఒకసారి ఈ ఫోన్లు ఆటోమేటిక్‌గా ‘స్క్రీన్ షాట్లు’ తీస్తాయి. ఈ చిత్రాలన్నీ ఒక ప్రత్యేక ఫోల్డర్‌లో సేవ్ అవుతాయి. వినియోగదారుడు ఆ ఫోల్డర్‌ను చూడగలడు కానీ, అందులోని ఫైళ్లను డిలీట్ చేయడం, మార్చడం సాధ్యం కాదు. అధికారులు తనిఖీ చేసినప్పుడు ఈ స్క్రీన్ షాట్లే తిరుగులేని సాక్ష్యాలుగా మారుతాయి. కేవలం నిఘానే కాకుండా, ప్రజల ఆలోచనలను కూడా ఈ ఫోన్లు నియంత్రిస్తున్నాయి. గ్లోబల్ ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో పాటు, టైప్ చేసేటప్పుడు ప్రభుత్వ వ్యతిరేక పదాలను ఇవి అంగీకరించవు. రాజకీయంగా సున్నితమైన పదాలను టైప్ చేస్తే సాఫ్ట్‌వేర్ వాటిని ఆటోమేటిక్‌గా మార్చేస్తుంది. అంటే ప్రజలు ఏం రాయాలో, ఏం మాట్లాడాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుది. టెక్నాలజీ సాకుతో పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ, వారిని బందీలుగా మారుస్తున్న ఈ విధానంపై అంతర్జాతీయ టెక్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hair Clips: హెయిర్ క్లిప్స్‌తో జుట్టుకు ప్రమాదం! నిపుణులు చెప్పిన అసలు నిజం ఇదే

సముద్రం అడుగున ప్రపంచంలోనే.. అతిపెద్ద జలపాతం

కొన్ని దేశాల్లో పాములు ఎందుకు ఉండవు ??

కింద పడ్డ మామిడికాయలు ఏరుకుంటే.. అంత పెద్ద శిక్షా?

తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండలు.. మరో 4 రోజుల పాటు సూర్యుడి విశ్వరూపం

Follow Us