సంపద తీసుకొచ్చే పూల మొక్కలు ఇవే.. ఇంట్లో ఉంటే డబ్బే డబ్బు!
samatha
19 may 2026
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వాస్తు ప్రకారం కొన్ని ఇంటికి అదృష్టం తీసుకొస్తే, మరికొన్ని దురదృష్టాన్ని తీసుకొస్తాయి.
వాస్తు శాస్త్రం
చాలా మంది తమ ఇంటి ముందు మొక్కలు పెంచుకుంటారు. అయితే కొన్ని రకాల మొక్కలు అదృష్టాన్ని తీసుకొస్తే కొన్ని రకాల మొక్కలు దురదృష్టాన్ని తీసుకొస్తాయి.
పూల మొక్కలు
అయితే వాస్తు ప్రకారం కొన్ని రకాల పూల మొక్కలు ఇంటిలో ఉండటం చాలా శుభప్రదం అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఈ మొక్కలు ఇంటిలో ఉండటం వలన సంపద పెరుగుతుందంట.
సంపద పెంచే మొక్కలు
కాగా, ఎలాంటి పూల మొక్కలు ఇంటిలో ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇంటిలో సంపద పెరగాలి అంటే ఏ రకం పూల మొక్కలు ఉండాలో చూసేద్దాం.
ఏ రకం మొక్కలు
ఇంటిలో ఎర్ర గులాబీ మొక్క లేదా ఎర్ర మందార పూల మొక్కలు ఉండటం చాలా శుభ ప్రదం. ఇది ఇంటికి ఆనందాన్ని, ఆదాయాన్ని తీసుకొస్తాయి.
ఎర్ర మందార లేదా గులాబీ
అలాగే శంఖు పువ్వు మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఎవరి ఇంటిలో అయితే ఈ పూల మొక్క ఉంటుందో వారికి అదృష్టం కలుగుతుంది.
శంఖు పూలు
అదే విధంగా మోదుగు పూల మొక్క ఇంటిలో ఉండటం చాలా మంచిది. ఇది ఎవరి ఇంటిలో అయితే ఉంటుందో, వారికి డబ్బుకు లోటు ఉండదు.
మోదుగు పూలు
అంతే కాకుండా ఇంటిలోపల పారిజాతం, మల్లెపూల మొక్కలు నాటడం చాలా శుభప్రదం అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. దీని వలన మహాలక్ష్మీ దేవి అనుగ్రహం లభించి, ధనానికి, ధాన్యానికి లోటు ఉండదంట.