షుగర్ ఉన్నవారు తాటి ముంజలు తినొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

samatha

18 may 2026

సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది తాటి ముంజలు ఇష్టంగా తింటారు. ఇది కేవలం వేసవిలో మాత్రమే లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తింటారు.

సమ్మర్

అంతే కాకుండా వీటిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇందులో ఐరన్, కాల్షియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ఆరోెగ్య ప్రయోజనాలు

అయితే ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది అయినప్పటికీ కొందరు తినకూడదంట. ముఖ్యంగా డయాబెటీస్ సమస్య ఉన్నవారు తాటి ముంజలు తినొచ్చా లేదా అనే డౌట్ ఉంటుంది.

డయాబెటీస్

కాడా డయాబెటీస్ ఉన్న వారు తాటి ముంజలు తిన వచ్చా? దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం చూద్దాం.

ఆరోగ్య నిపుణులు

వైద్య నిపుణుల ప్రకారం, డయాబెటీస్ ఉన్నవారు తాటి ముంజలు తినడం ఆరోగ్యానికి మంచిదేనంట. ఇందులో కేలరీలు తక్కువ, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.

ఆరోగ్యానికి మంచిది

అందువలన ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అంతగా పెంచవు. అంతే కాకుండా ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేసి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నెమ్మదిగా ప్రవేశించేలా చేస్తుందంట.

జీర్ణక్రియ

అంతే కాకుండా ఇందులో విటమిన్ బి, ఐరన్, కాల్షియం, జింక్ వంటివి ఎక్కువగా ఉంటాయి. అందు వలన ఇవి శరీరానికి చాలా మంచిది.

పోషకాలు పుష్కలం

ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు వీటిని తినడం వలన ఇవి అలసటను తగ్గించి, శరీరానికి కావాల్సిన తక్షిణ శక్తిని అందిస్తాయి.

తక్షణ శక్తి