Janhvi Kapoor: జాన్వీ కపూర్ కెరీర్‌కు కీలకంగా మారిన పెద్ది సక్సెస్
‘దేవర’తో టాలీవుడ్‌లో విజయవంతమైన ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ఇప్పుడు ‘పెద్ది’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే సినిమా ప్రమోషన్స్‌లో ఆమె కనిపించకపోవడంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత తక్కువగా ఉందనే ప్రచారం జరుగుతుండగా, త్వరలోనే జాన్వీ ప్రమోషన్స్‌లో పాల్గొంటారని చిత్ర యూనిట్ స్పష్టం చేస్తోంది.
దేవరతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. పెద్ది సినిమాతో పాతుకుపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అంతా బాగానే ఉన్నా.. ప్రమోషన్స్‌కి ఎందుకు దూరంగా ఉంటున్నారనే విషయంపై చర్చ మొదలైందిప్పుడు. సినిమాలో ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోవడం వల్లే జాన్వీ సైలెంట్ అయ్యారంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత..? అచ్చియమ్మ ప్రమోషన్స్‌కు వస్తారా..? దేవర సినిమాతో టాలీవుడ్‌కు బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చారు జాన్వీ కపూర్. బాలీవుడ్‌లో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న విజయం.. తెలుగులో తొలి సినిమాతోనే వచ్చింది. అయితే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలంటే జాన్వీకి పెద్ది సక్సెస్ కీలకంగా మారిందిప్పుడు. దేవరలో తంగం పాత్రతో అలరించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పెద్దిలో అచ్చియమ్మ అంటూ మరోసారి గ్రామీణ యువతి పాత్రలో నటిస్తున్నారు. సినిమా విడుదలకు సిద్ధమవుతున్నా.. పెద్ది ప్రమోషన్స్‌లో జాన్వీ కపూర్ ఎక్కడా కనిపించకపోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిందిప్పుడు. ఈ సినిమాలో తన క్యారెక్టర్‌కి పెద్దగా స్కోప్ లేకపోవడం వల్లే జాన్వీ ప్రమోషనల్ ఈవెంట్స్‌కు దూరంగా ఉంటున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఏమో అందులో నిజం లేకపోలేదంటూ బయట కూడా ప్రచారం జరుగుతుంది. జాన్వీ కపూర్‌పై వస్తున్న ఈ ప్రమోషనల్ రూమర్స్‌ను పెద్ది చిత్ర యూనిట్ పూర్తిగా కొట్టిపారేస్తుంది. సినిమాలో ఆమెది చాలా ముఖ్యమైన రోల్ అని, మెయిన్ ప్రమోషన్స్ ఇంకా మొదలవ్వలేదని.. త్వరలోనే జాన్వీ కపూర్ కూడా ప్రచారంలో జాయిన్ అవుతారని మేకర్స్ స్పష్టం చెప్తున్నారు. దేవర తర్వాత వస్తున్న సినిమా కావడంతో జాన్వీకి పెద్ది అత్యంత కీలకం. పెద్ది ప్రమోషనల్ ప్లాన్ కూడా నెక్ట్స్ లెవల‌్‌లో ఉంది. మే 18 నుంచి జూన్ 2 వరకు నాన్ స్టాప్ ప్రమోషన్స్ చేయడానికి పెద్ది టీం భారీ ప్లాన్ రెడీ చేసింది. అందులో చరణ్‌తో పాటు జాన్వీ కూడా జాయిన్ అవుతారనే ఆశిస్తున్నారు. మరి దేవర తర్వాత రాబోతున్న ఈ సినిమాతో.. టాలీవుడ్‌లో జాన్వీ కపూర్ స్టార్‌గా సెట్ అవుతారా లేదా అనేది చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉత్తర కొరియా ఫోన్ల వెనుక భయంకర నిజాలు.. ప్రతి 2 నిమిషాలకు స్క్రీన్‌షాట్
Hair Clips: హెయిర్ క్లిప్స్‌తో జుట్టుకు ప్రమాదం! నిపుణులు చెప్పిన అసలు నిజం ఇదే
సముద్రం అడుగున ప్రపంచంలోనే.. అతిపెద్ద జలపాతం
సముద్రం అడుగున ప్రపంచంలోనే.. అతిపెద్ద జలపాతం
కొన్ని దేశాల్లో పాములు ఎందుకు ఉండవు ??
కింద పడ్డ మామిడికాయలు ఏరుకుంటే.. అంత పెద్ద శిక్షా?
విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు.. ఈజీగా తెలుసుకునేలా.. !
మంటల్లో కావేరి ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన ముప్పు
చిలుకూరు బాలాజీ ఆలయాన్ని.. టార్గెట్ చేసిన అమెరికా
రెచ్చిపోయిన దొంగలు.. ఒకే ఇంట్లో 120 తులాల బంగారం, కేజీ వెండి చోరీ

