ప్రతి ఇంట్లో ఉండే పానియం.. రోజూ గ్లాసుడు తాగితే వేసవిలో కూల్‌ కూల్!

19 May 2026

TV9 Telugu

TV9 Telugu

వేడి ఎక్కువగా ఉండే వేసవిలో జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తరచూ వెంటాడుతుంటాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆకలి తగ్గడం, ఆమ్లత్వం పెరగడం, ఆహారం ఆలస్యంగా జీర్ణం కావడం వంటి సమస్యలు కనిపిస్తాయి

TV9 Telugu

ఇలాంటి సమయంలో పెరుగు, మజ్జిగ వంటి సంప్రదాయ ఆహారాలు మళ్లీ ప్రాధాన్యం పొందుతున్నాయి. వేస‌వి కాలంలో చాలా మంది వీటిని ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటారు

TV9 Telugu

ఇవి రెండూ శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా పేగు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అధిక వేడి కారణంగా శరీరంలోని మెటబాలిజం మందగిస్తుంది. జీర్ణక్రియకు అవసరమైన గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ పనితీరు తగ్గడంతో ఆహారం సరిగా జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది

TV9 Telugu

శరీరంలో నీటి కొరత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెంచే ఫెర్మెంటెడ్ ఆహారాలను వేసవిలో ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. పరిశోధనల ప్రకారం పెరుగు వంటి ఫెర్మెంటెడ్ పాల పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో, లాక్టోస్ జీర్ణం కావడంలో ఉపయోగపడతాయి

TV9 Telugu

పెరుగులో ప్రోటీన్, కాల్షియం కూడా అధికంగా ఉండటంతో ఇది శరీరానికి పోషకాహారాన్ని అందిస్తుంది. అయితే పెరుగు మందంగా ఉండటంతో కొందరికి వేసవిలో పొట్ట‌ భారంగా అనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆమ్లత్వం లేదా నెమ్మదైన జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారికి ఇది కొంత ఇబ్బంది కలిగిస్తుంది

TV9 Telugu

ఇక పెరుగును నీటితో పలుచగా చేసి మ‌జ్జిగ‌ను తయారు చేస్తారు. ఇందులో జీలకర్ర, అల్లం, పుదీనా వంటి జీర్ణక్రియకు సహాయపడే పదార్థాలను కూడా కలుపుతారు. నీరు ఎక్కువగా ఉండటం వల్ల మజ్జిగ తేలికగా జీర్ణమవుతుంది

TV9 Telugu

అలాగే పెరుగుతో పోలిస్తే కొవ్వు మోతాదు తక్కువగా ఉంటుంది. ఆయుర్వేదంలో మజ్జిగను సహజ జీర్ణ టానిక్‌గా చెబుతారు. ఇది కడుపు ఉబ్బరం, అసౌకర్యం తగ్గించడంలో సహాయపడుతుంది. భోజనం తర్వాత మజ్జిగను తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడటంతోపాటు శరీరానికి తేమను అందిస్తుంది

TV9 Telugu

పెరుగు, మజ్జిగ రెండింటిలోనూ ప్రోబయోటిక్స్ ఉంటాయి. అయితే వేసవిలో శరీర వేడి అధికంగా ఉన్నప్పుడు తేలికపాటి ఫెర్మెంటెడ్ పానీయాలు పొట్ట‌పై తక్కువ ఒత్తిడి కలిగిస్తాయి. అందుకే మధ్యాహ్న భోజనం తర్వాత మజ్జిగ తీసుకోవాలి. బలమైన జీర్ణక్రియ ఉన్నవారు పెరుగును మితంగా తీసుకోవచ్చు