AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Movie: ‘పెద్ది’ కోసం రామ్ చరణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? జాన్వీ కపూర్‌కు అన్ని కోట్లా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' సినిమా ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా జూన్ 04న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Peddi Movie: 'పెద్ది' కోసం రామ్ చరణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? జాన్వీ కపూర్‌కు అన్ని కోట్లా?
Peddi Movie
Basha Shek
|

Updated on: May 19, 2026 | 2:27 PM

Share

రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘పెద్ది’ రిలీజ్ కు సమయం దగ్గరపడుతోంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా జూన్ 04న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా సోమవారం (మే 18) ట్రైలర్ రిలీజ్ చేయగా అనూహ్య స్పందన వస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ లో పెద్ది ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో ఉంటోంది. కాగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో పెద్ది సినిమా తెరకెక్కుతోంది. అందుకు తగ్గట్టుగానే భారీ క్యాస్టింగ్ ఉందీ సినిమాలో. ‘ఉప్పెన’ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు బుచ్చి బాబు సనా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి, కమెడియన్ సత్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ మెగా మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ది నటుల రెమ్యునరేషన్స్ గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

పెద్ది సినిమాలో నటించినందుకు రామ్ చరణ్ ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. ఇది ఆయన కెరీర్‌లోనే అత్యధికం.అతుకు ముందు ఆర్ఆర్ఆర్ ,గేమ్ ఛేంజర్ సినిమాల కోసం ఆయన 50 కోట్ల వరకూ ఛార్జ్ చేశారని తెలుస్తోంది. దేవర తర్వాత పెద్దితో తెలుగు ఆడియెన్స్ ను పలకరిస్తోన్న జాన్వీకి సుమారు 6 కోట్ల వరకూ రెమ్యునరేషన్ అందినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ నటుడు, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ కూడా ‘పెద్ది’ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం అతను 7 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఇక రామ్ చరణ్ తర్వాత అత్యధిక పారితోషికం డైరెక్టర్ బుచ్చిబాబుదే. పెద్ది’ సినిమాను డైరెక్ట్ చేసినందుకు ఆయన 30 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది.

అలాగే ఈ సినిమాలో వివిధ పాత్రల్లో మెరిసిన జగపతిబాబు కు 5 కోట్లు, శివరాజ్ కుమార్ కు 10 కోట్లు పారితోషికం అందిందని టాక్. ఇక సంగీతం సమకూర్చిన ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కు కూడా భారీగా పారితోషికం ఇచ్చారని సమాచారం.

రామ్ చరణ్ పెద్దిపై రిషభ్ శెట్టి ప్రశంసలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us