AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: గర్భిణీలను టార్గెట్ చేసి చంపే సైకో.. ఓటీటీ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ స్టోరీ.. IMDBలో 8 రేటింగ్

మీకు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లంటే ఇష్టమా? అయితే మీకోసమే ఈ న్యూస్. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఓ రియల్ క్రైమ్ స్టోరీ ఇప్పుడు ఓటీటీలో హల్ చల్ చేస్తోంది. ఐఎమ్ డీబీలోనూ ఈ మూవీకి 10కి 8 రేటింగ్ ఉండడం విశేషం.

OTT Movie: గర్భిణీలను టార్గెట్ చేసి చంపే సైకో.. ఓటీటీ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ స్టోరీ.. IMDBలో 8 రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: May 18, 2026 | 7:54 PM

Share

ప్రస్తుతం ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లదే హవా. అందులోనూ నిజ జీవిత సంఘటలన ఆధారంగా తెరకెక్కిన సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఓటీటీలో బాగా ఆదరణ లభిస్తోంది. అందుకే ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను కూడా తెలుగు అనువాదం చేసి మరీ ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. అలా గత వారం ఓటీటీకి వచ్చిన ఓ తెలుగు సినిమా ఇప్పుడు బాగా ట్రెండింగ్‌ అవుతోంది. గర్భిణీలను మాత్రమే టార్గెట్ చేసి దారుణంగా చంపే సైకో కిల్లర్ చుట్టూ తిరిగే ఈ సినిమాకు ఐఎమ్ డీబీలోనూ పదికి 8 రేటింగ్ దక్కడం విశేషం. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం, పెద్దగా ప్రమోషన్లు చేయకపోవడం ఈ సినిమాకు మైనస్ గా మారింది. అయితే ఇప్పుడీ సినిమా సడెన్ గా స్ట్రీమింగ్ కు వచ్చింది. థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపని ఈ క్రైమ్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ లో మాత్రం టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. స్టోరీ విషయానికి వస్తే.. నగరంలో వరుసగా గర్భిణులు హత్యకు గురవుతారు. వీటి వెనక ఒక సైకో కిల్లర్ ఉన్నాడని పోలీసులు గ్రహిస్తారు. కానీ ఎంత ప్రయత్నించినా ఆ క్రిమినల్ జాడ తెలుసుకోలేకపోతారు. దీంతో ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఈ కేసును టేకప్ చేస్తాడు. ఈ క్రమంలో ఆ డిటెక్టివ్ కు సంచలన విషయాలు తెలుస్తాయి. మరి అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు? కేవలం గర్భిణీలనే ఎందుకు చంపుతున్నాడు? ఈ ఘోరాల వెనుక ఉన్న అతని ఉద్దేశమేంటి? పోలీసులు ఆ సైకోను ఎలా పట్టుకున్నారన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సినిమా పేరు Cమంతం (Cmantham). దర్శకుడు సుధాకర్ పాని తెరకెక్కించిన ఈ సినిమాలో వజ్రయోగి, శ్రేయ భారతి ప్రధాన పాత్రల్లో నటించారు. థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపని ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో మాత్రం ఆకట్టుకంటోంది. ఈ సిఇనమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా, రెండు రోజుల క్రితమే ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.ప్రస్తుతం ఈ సినిమా కేవలం రెంటల్ విధానంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. మరికొన్ని రోజుల్లో ఫ్రీగా చూసే అవకాశం లభించవచ్చు. మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూడాలనుకునేవారికి సీమంతం ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!