AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khan: షారుఖ్ గ్యారేజ్‌లోకి మరో లగ్జరీ కారు.. అందులోనే ఫ్రిడ్జ్‌ కూడా.. కాస్ట్ ఎంతో తెలుసా?

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గ్యారేజీలోకి మరో కొత్త కారు చేరింది. ప్రముఖ అమెరికన్ ఆటోమొబైల్ బ్రాండ్ 'కాడిలాక్ ఎస్కలేడ్' కారును అనే కొనుగోలు చేశారు. ఈ లగ్జరీ కారులో ముంబైలో షారుఖ్ ఖాన్ చక్కర్లు కొడుతోన్న వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

Shah Rukh Khan: షారుఖ్ గ్యారేజ్‌లోకి మరో లగ్జరీ కారు.. అందులోనే ఫ్రిడ్జ్‌ కూడా.. కాస్ట్ ఎంతో తెలుసా?
Shah Rukh Khan
Basha Shek
|

Updated on: May 15, 2026 | 4:52 PM

Share

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గ్యారేజీలో పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ గ్యారేజీలోకి మరో ఖరీదైన కారు చేరింది. అవును, కింగ్ ఖాన్ ఇటీవల సరికొత్త కాడిలాక్ ఎస్కలేడ్ కారును కొనుగోలు చేశారు. ఇటీవల, ముంబై రోడ్లపై షారుఖ్ ఖాన్ తన కొత్త నల్లటి ఎస్‌యూవీని నడుపుతున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రముఖ అమెరికన్ ఆటోమొబైల్ బ్రాండ్ ‘క్యాడిలాక్’ భారతదేశంలో అధికారికంగా తన కార్లను విక్రయించదు. అందుకే, షారుఖ్ ఖాన్ ఈ కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారని చెబుతున్నారు. దిగుమతి సుంకం, పన్నులు కలుపుకొని భారతదేశంలో ఈ క్యాడిలాక్ ఎస్కలేడ్ కారు ఆన్-రోడ్ ధర సుమారు రూ. 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన SUVలలో కాడిలాక్ ఎస్కలేడ్ కారు ఒకటి. ఇందులో చాలా ఫీచర్లు ఉన్నాయి. పవర్ ఫుల్ 6.2 లీటర్ V8 ఇంజన్ ఉంటుంది. దీంతో కారు చాలా వేగంగా ప్రయాణించగలదు. కారు లోపలి భాగంలో ఆకర్షణీయమైన 38-అంగుళాల కర్వ్డ్ OLED డిస్‌ప్లే స్క్రీన్ ఉంది. డ్యూయల్-పేన్ పవర్ స్కై గ్లాస్ రూఫ్ (సన్‌రూఫ్) ఈ కారుకు మరింత రాజసాన్ని అద్దింది. సెంటర్ కన్సోల్‌లో ఫ్రీజర్ మోడ్‌తో కూడిన ఒక చిన్న ఫ్రిట్జ్ కూడా ఈ కారులో ఉంటుంది. అలాగే హెడ్‌రెస్ట్ స్పీకర్‌లతో కూడిన అత్యాధునిక AKG స్టూడియో రిఫరెన్స్ 42-స్పీకర్ సౌండ్ సిస్టమ్‌ కూడా ఉంటుంది. హీటెడ్, వెంటిలేటెడ్, మసాజ్ ఫీచర్లతో కూడిన సీట్లు ప్రయాణాన్ని అత్యంత సుఖవంతంగా మారుస్తాయి.

ఇవి కూడా చదవండి

కాగా కింగ్ ఖాన్ దగ్గర ఇప్పటికే ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. రోల్స్-రాయ్స్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్, రోల్స్-రాయ్స్ ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్, BMW i8, మెర్సిడెస్-బెంజ్ S-క్లాస్ గార్డ్ వంటి అనేక కార్లు ఉన్నాయి. షారుఖ్ ఖాన్ ప్రస్తుతం యాక్షన్-థ్రిల్లర్ ‘కింగ్’ షూటింగ్‌లో బిజీగా ఉంటున్నారు. ఈ చిత్రంలో ఆయన కుమార్తె సుహానా ఖాన్, దీపికా పడుకోణె, అభిషేక్ బచ్చన్ కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కొత్త కాడిలాక్ ఎస్కలేడ్ కారులో షారుఖ్ ఖాన్ చక్కర్లు .. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us