AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Kevvu Kartheek: మా అమ్మ కోరిక తీరింది.. జబర్దస్త్ కెవ్వు కార్తిక్ ఎమోషనల్ పోస్ట్.. ఏం జరిగిందంటే?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కెవ్వు కార్తిక్ కూడా ఒకరు. సాధారణ కంటెస్టెంట్ గా ఈ షోలోకి అడుగు పెట్టిన అతను ఇప్పుడు టీమ్ లీడర్ అయ్యాడు. కేవలం టీవీ షోలే కాదు అప్పుడప్పుడు సినిమాల్లోనూ కనిపిస్తున్నాడీ కమెడియన్.

Jabardasth Kevvu Kartheek: మా అమ్మ కోరిక తీరింది.. జబర్దస్త్ కెవ్వు కార్తిక్ ఎమోషనల్ పోస్ట్.. ఏం జరిగిందంటే?
Jabardasth Kevvu Kartheek
Basha Shek
|

Updated on: May 18, 2026 | 5:32 PM

Share

లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్నివదిలి పెట్టి మరీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు కెవ్వ కార్తిక్. అందుకు తగ్గట్టుగానే తన కామెడీతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నాడీ యాక్టర్. జబర్దస్త్ షోలో ఓ సాధారణ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన కార్తిక్ ఆ తర్వాత టీమ్ లీడర్ గా ఎదిగిపోయాడు. ‘కెవ్వు కార్తిక్’ పేరుతో అతని చేసే స్కిట్స్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తున్నాడు కార్తిక్. అలాగే కొన్ని సినిమాల్లోనూ కనిపిస్తున్నాడు. టీవీ షోస్, సినిమాల సంగతి పక్కన పెడితే.. రెండేళ్ల క్రితం సిరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కార్తిక్. తాజాగా ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను కార్తీకే స్వయంగా సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నాడు.

హాస్పిటల్లో తన భార్య చెయ్యి పట్టుకొని అలాగే, తన బిడ్డని ఎత్తుకున్న ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు కార్తిక్. ‘ మేం అమ్మనాన్నలు అయ్యాం. చిన్ని పాదాలతో మా జీవితాల్లోకి వచ్చిన బిడ్డ మా జీవితాలని మార్చేసింది. నేను అమ్మని కోల్పోయిన రెండేళ్ల తర్వాత ఈ బిడ్డ మా జీవితాల్లోకి వచ్చింది. ఇప్పుడు ఒక కొత్త వెలుగు మా జీవితాల్లోకి వచ్చింది. మేము పేరెంట్స్ అయ్యాం. మా అమ్మ కోరిక తీర్చాను’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు కార్తిక్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.పలువురు జబర్దస్త్ కమెడియన్స్, సెలబ్రిటీలు కెవ్వు కార్తీక్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

భార్య, బిడ్డతో జబర్దస్త్ కమెడియన్..

కాగా రెండేళ్ల క్రితం అనారోగ్య సమస్యలతో పోరాడుతూ కార్తీక్ తల్లి కన్నుమూసింది. ఇప్పుడు ఆమెనే  తన బిడ్డ రూపంలో తిరిగొచ్చింది అంటున్నాడు కార్తీక్. ప్రస్తుతం ఈ కమెడియన్ తెలుగులో రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడని తెలుస్తోంది. అలాగే పలు టీవీ షోస్ లోనూ సందడి చేస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మా అమ్మ కోరిక తీరింది.. జబర్దస్త్ కెవ్వు కార్తిక్ ఎమోషనల్ పోస్ట్
మా అమ్మ కోరిక తీరింది.. జబర్దస్త్ కెవ్వు కార్తిక్ ఎమోషనల్ పోస్ట్
తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై కంపెనీల బిగ్ అప్‌డేట్..
తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై కంపెనీల బిగ్ అప్‌డేట్..
ఎముకలకు బలాన్నిచ్చే కోడి కాళ్ల సూప్.. ఇలా తింటే ఎన్ని లాభాలో..
ఎముకలకు బలాన్నిచ్చే కోడి కాళ్ల సూప్.. ఇలా తింటే ఎన్ని లాభాలో..
బక్రీద్ పండుగ ఆ రోజు కాదు.. సెలవుపై అంతటా గందరగోళం..
బక్రీద్ పండుగ ఆ రోజు కాదు.. సెలవుపై అంతటా గందరగోళం..
ఐపీఎల్‌లో కోటీశ్వరుడు.. ఆటలో నిత్య దరిద్రుడు.. కట్‌చేస్తే.
ఐపీఎల్‌లో కోటీశ్వరుడు.. ఆటలో నిత్య దరిద్రుడు.. కట్‌చేస్తే.
మహిళా రైతుపై తోపుడుబండ్ల వ్యాపారుల దాడి..మామిడి పండ్లు రోడ్డుపాలు
మహిళా రైతుపై తోపుడుబండ్ల వ్యాపారుల దాడి..మామిడి పండ్లు రోడ్డుపాలు
కోళ్లగూడు క్లీన్ చేస్తుంటే ఊహించని సీన్.. ఎర్రతేలు వీపుపై ఏముందో
కోళ్లగూడు క్లీన్ చేస్తుంటే ఊహించని సీన్.. ఎర్రతేలు వీపుపై ఏముందో
హార్ట్ షేప్ సరస్సు..ఇంతటి అందం..దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉందంటే..
హార్ట్ షేప్ సరస్సు..ఇంతటి అందం..దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉందంటే..
ఇది కరెక్ట్ కాదు సార్.. సీఎం విజయ్ నిర్ణయాన్ని తప్పుబట్టిన విశాల్
ఇది కరెక్ట్ కాదు సార్.. సీఎం విజయ్ నిర్ణయాన్ని తప్పుబట్టిన విశాల్
తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండలు.. మరో 4 రోజుల పాటు..
తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండలు.. మరో 4 రోజుల పాటు..