Prabhas: ఆ విషయంలో ప్రభాస్‌ను కొట్టేవాళ్లే లేరు
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలకు ఇటీవల స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల కంటే టాలెంటెడ్ కంపోజర్లనే ఎంపిక చేస్తున్నారు దర్శకులు. ‘కల్కి’కి సంతోష్ నారాయణన్, ‘సలార్’కు రవి బస్రూర్, ‘ఫౌజీ’కి విశాల్ చంద్రశేఖర్ వంటి సంగీత దర్శకులు పని చేస్తున్నారు. సంగీత ఎంపికలో దర్శకులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్న ప్రభాస్, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
ప్రభాస్ సినిమా అంటే క్వాలిటీ ఆఫ్ మేకింగ్ కూడా అలాగే ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు ఫ్యాన్స్. అన్నీ ఓకే కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలోనే మేకర్స్ ఛాయిస్ డిఫెరెంట్‌గా ఉంటుంది. ప్యాన్ ఇండియా స్టార్ అయినా.. ప్రభాస్ సినిమాలకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కాకుండా టాలెంటెడ్ వైపు వెళ్తున్నారు దర్శక నిర్మాతలు. కొన్నేళ్లుగా ఇదే జరుగుతుంది.. మరి దీనికి కారణమేంటి..? ప్రభాస్ సినిమాలకు ఒకప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ పని చేసేవాళ్లు. కానీ ఆయన ప్యాన్ ఇండియన్ స్టార్ అయ్యాక.. అగ్ర సంగీత దర్శకులు కాకుండా టాలెంట్ ఉన్న చిన్న మ్యూజిక్ డైరెక్టర్స్ వైపే దర్శకుల అడుగులన్నీ పడుతున్నాయి. కొన్నేళ్ళుగా రెబల్ స్టార్ సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. కొన్నేళ్లుగా ప్రభాస్ సినిమాల్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పని చేసింది రాజా సాబ్‌కు మాత్రమే. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. దానికి ముందు వచ్చిన కల్కికి సంతోష్ నారాయణన్.. రాధేశ్యామ్‌కు జస్టిన్ ప్రభాకరన్.. సాహోకు జిబ్రన్.. సలార్‌కు రవి బస్రూర్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేసారు. సెట్స్ మీదున్న సినిమాలకు ఇదే అప్లై అవుతుంది. తన సినిమాల మ్యూజిక్ ఛాయిస్ పూర్తిగా దర్శకులకే ఇచ్చేస్తున్నారు ప్రభాస్. అందుకే ఫౌజీ సినిమాకు సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఇక స్పిరిట్‌కు కూడా దానికి ముందు యానిమల్‌కు పని చేసిన హర్షవర్ధన్ రామేశ్వర్‌నే కంటిన్యూ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగా. కల్కి 2 సినిమాకు సంతోష్ నారాయణన్ కంటిన్యూ అవుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌ను మార్చేస్తారనే టాక్ నడిచినా కూడా అదేం లేదని క్లారిటీ ఇస్తూ సంతోష్‌కు బర్త్ డే విషెస్ చెప్పింది వైజయంతి సంస్థ. వెల్ కమ్ టూ కల్కి 2 అంటూ పోస్ట్ చేసారు వాళ్లు. మొత్తానికి తన సినిమాలకు స్టార్స్ కాకుండా టాలెంటెడ్ సంగీత దర్శకులతో పని చేస్తున్నారు ప్రభాస్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉత్తర కొరియా ఫోన్ల వెనుక భయంకర నిజాలు.. ప్రతి 2 నిమిషాలకు స్క్రీన్‌షాట్
Hair Clips: హెయిర్ క్లిప్స్‌తో జుట్టుకు ప్రమాదం! నిపుణులు చెప్పిన అసలు నిజం ఇదే
సముద్రం అడుగున ప్రపంచంలోనే.. అతిపెద్ద జలపాతం
సముద్రం అడుగున ప్రపంచంలోనే.. అతిపెద్ద జలపాతం
కొన్ని దేశాల్లో పాములు ఎందుకు ఉండవు ??
కింద పడ్డ మామిడికాయలు ఏరుకుంటే.. అంత పెద్ద శిక్షా?
విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు.. ఈజీగా తెలుసుకునేలా.. !
మంటల్లో కావేరి ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన ముప్పు
చిలుకూరు బాలాజీ ఆలయాన్ని.. టార్గెట్ చేసిన అమెరికా
రెచ్చిపోయిన దొంగలు.. ఒకే ఇంట్లో 120 తులాల బంగారం, కేజీ వెండి చోరీ

