AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ.. టాప్ గ్రేడ్‌లో ఆ ముగ్గురు..?

BCCI Central Contracts: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఏటా సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ప్రకటిస్తుంది. గత ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాలుగా నాలుగు గ్రేడ్‌లలో ఆటగాళ్లను చేర్చుతూ జీతాలను అందిస్తోంది. అయితే, తాజాగా బోర్డు వీటిని కేవలం 3 గ్రేడ్‌లకు తగ్గించినట్లు తెలుస్తోంది. రోహిత్, కోహ్లీల గ్రేడ్‌లను తగ్గించారు.

రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ.. టాప్ గ్రేడ్‌లో ఆ ముగ్గురు..?
Rohit Virat
Venkata Chari
|

Updated on: Feb 07, 2026 | 10:20 AM

Share

BCCI Central Contracts: అనుకున్నట్లుగానే బీసీసీఐ రోహిత్, కోహ్లీలకు షాకిచ్చింది. ఎందుకంటే, బీసీసీఐ తాజాగా విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ఈ ఇద్దరు దిగ్గజాల గ్రేడ్ లను తగ్గించింది. మొత్తం 30 మంది ఆటగాళ్లతో విడుదలై ఈ జాబితాలో టీమిండియా సెన్సేషన్ పేరు లేకపోవడం గమనార్హం. ఇందులో కీలక అంశం ఏంటంటే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల గ్రేడ్ లను ఏ+ నుంచి బీ గ్రేడ్ కు తగ్గించింది. అలాగే ఏ+ గ్రేడ్ ను రద్దు చేసింది. అసలు ఈ లిస్ట్ లో ఎవరున్నారు, ఎవరికి బీసీసీఐ హ్యాండిచ్చిందో ఓసారి చూద్దాం..

ఇంతకుముందు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లో నాలుగు గ్రేడ్ లు ఉండేది. ఇప్పుడు అవి మూడుకు తగ్గించారు. రోహిత్, కోహ్లీ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. టీ20, టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఒకే ఫార్మాట్ ఆడే ఆటగాళ్లు టాప్ గ్రేడ్ లో చేర్చరు. దీంతో రోహిత్, కోహ్లీలను బీ గ్రేడ్ కు మార్చారు. ఈక్రమంలో బీసీసీఐ బోర్డ్ కార్యదర్శి దేవ్ జిత్ సైకియా మాట్లాడుతూ.. గత ఏడాది 7 కోట్లు సంపాదించిన రోహిత్, కోహ్లీలకు ఈసారి 3 నుంచి 5 కోట్ల మధ్య అందుకోనున్నారు. అయితే, బీసీసీఐ ఇంకా ఈ లిస్ట్ ను విడుదల చేయలేదని తెలుస్తోంది.

టాప్ గ్రేడ్ లో ఎవరున్నారంటే..

నివేదికల మేరకు టాప్ గ్రేడ్ లో ముగ్గురు మాత్రమే చోటు దక్కించుకున్నారు. వీరిలో వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్, స్టార్ పేసర్ జస్ర్పీత్ బుమ్రా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఉన్నారు. ఈ ముగ్గురు అత్యధిక జీతం అందుకోనున్నారు. అయితే, ఆటగాళ్ల జీతాల్లో ఏవైనా మార్పులు చేశారా లేదా అనేది చూడాలి. ఇప్పటి వరకు ఏ+ గ్రేడ్ లో ఉన్నవారికి రూ. 7 కోట్లు అందనుండగా, ఏ గ్రేడ్ లో ఉన్నవారికి రూ. 5 కోట్లు, బీ గ్రేడ్ లో ఉన్నవారు రూ. 3 కోట్లు, ఇక చివరి గ్రేడ్ సీలో ఉన్నవారు రూ. 1 కోటి జీతం అందుకునేవారు.

లిస్ట్ లో 30 మంది పేర్లు..

గత ఏడాది మొత్తం 34 మంది ఆటగాళ్లను సెంట్రల్ కాంట్రాక్టుల్లో చేర్చారు. ఈ ఏడాది 30 మంది మాత్రమే ఉన్నారు. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ తాజాగా ఈ లిస్ట్ లో చేరాడు. తొలిసారి ఎంపికయ్యాడు. ముగ్గురు ఆటగాళ్ళు గ్రేడ్ ఏలో ఉండగా, 11 మంది గ్రేడ్ బీలో, 16 మంది గ్రేడ్ సీలో చోటు దక్కించుకున్నారు. ఈ ఒప్పందం అక్టోబర్ 1, 2025 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు ఉండనుంది. అయితే బీసీసీఐ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదని గమనించాలి.

గ్రేడ్-ఎ: శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా

గ్రేడ్-బి: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, శ్రేయాస్ అయ్యర్.

గ్రేడ్-సి: తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివమ్ దూబే, సంజు శాంసన్, రింకూ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ఆకాష్ దీప్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, ధ్రువ్ జురైల్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us