AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs USA: రోహిత్, కోహ్లీకి షాకిచ్చిన జట్టుతో తొలి పోరు.. సూర్య ప్లేయింగ్ 11 నుంచి బ్యాడ్ లక్ ప్లేయర్ ఔట్..?

T20 World Cup 2026 IND vs USA Preview: టీ20 ప్రపంచకప్ 2026 తొలిరోజునే భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. అమెరికా జట్టుతో ఢీ కొట్టేందుకు సిద్దమైంది. అయితే, ఈ మ్యాచ్‌ ప్లేయింగ్ 11తో శాంసన్ పరిస్థితి ఏంటో తెలియనుంది. ఇషాన్, శాంసన్‌ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మరి సూర్య, గంభీర్ ఎవరితో ముందుకు వెళ్తారో చూడాలి.

IND vs USA: రోహిత్, కోహ్లీకి షాకిచ్చిన జట్టుతో తొలి పోరు.. సూర్య ప్లేయింగ్ 11 నుంచి బ్యాడ్ లక్ ప్లేయర్ ఔట్..?
T20 World Cup 2026 Ind Vs Usa Preview
Venkata Chari
|

Updated on: Feb 07, 2026 | 8:33 AM

Share

T20 World Cup 2026 IND vs USA Preview: Probable Playing XI, Pitch Report, Prediction: టీ20 ప్రపంచ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనుంది. అయితే, టీ20 ప్రపంచకప్ హిస్టరీలో ఇప్పటివరకు ఏ ఇతర జట్టు కూడా తన టైటిల్‌ను కాపాడుకోలేకపోవడం గమనార్హం. తొలి రోజు నుంచే భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్ అమెరికాతో ఆడనుంది. గత ప్రపంచ కప్‌లో రోహిత్, కోహ్లీ దిగ్గజాలు ఉన్న భారత జట్టుకు చుక్కలు చూపించిన అమెరికా.. ఇప్పుడు సూర్యసేనతో ఢీ కొట్టేందుకు సిద్ధమైంది. అయితే, అమెరికా జట్టులో 4గురు ఆటగాళ్లు అమెరికాలో జన్మించగా, 11 మంది విదేశాలలో జన్మించిన వారే కావడం గమనార్హం.

ఈ మ్యాచ్ ముంబై వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ పిచ్‌పై ఎడమచేతి వాటం పేసర్ సౌరభ్ నేత్రావల్కర్ టీమిండియా ప్లేయర్లకు ఇబ్బందిగా మారవచ్చు. గత టీ20 ప్రపంచకప్ లో ముఖ్యంగా పవర్‌ప్లేలోనే రోహిత్, కోహ్లీని ఔట్ చేయడం గమనార్హం.

ప్రపంచ ఛాంపియన్ తర్వాత ఏ సిరీస్‌ను కోల్పోని భారత్..

భారత జట్టు ఇటీవలి ఫామ్ అద్భుతంగా ఉంది. 16 రోజుల క్రితం రాయ్‌పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు 209 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించి సత్తా చాటింది.

గత టీ20 ప్రపంచ కప్ తర్వాత టీమిండియా ఒక్క టీ20 సిరీస్‌ను కూడా ఓడిపోలేదు. దాదాపు 8 జట్లతో ద్వైపాక్షిక సిరీస్‌ల్లో తలపడింది. రికార్డుల పరంగా భారత జట్టు 34 మ్యాచ్‌లలో 25 గెలిచి ఆరింటిలో మాత్రమే ఓటమిపాలైంది. ఒక మ్యాచ్ టై కాగా, 2 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.

హెడ్ ​​టు హెడ్ రికార్డ్స్..

భారత జట్టు అమెరికాపై 100 శాతం విక్టరీ రికార్డును కలిగి ఉంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఒకే ఒక టీ20 మ్యాచ్ ఆడాయి. అది గత టీ20 ప్రపంచ కప్‌లో చోటు చేసుకుంది. ఆ మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచింది.

న్యూయార్క్‌లోని నస్సావు కౌంటీ క్రికెట్ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా జట్టు కేవలం 110 పరుగులు మాత్రమే చేసింది. 111 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 18.2 ఓవర్లలో ఛేదించింది.

టీమిండియా బలాలు, బలహీనతలు..

అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ప్లేయర్లతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది. ఇక మిడిల్ ఆర్డర్‌లో హార్దిక్ పాండ్యా, శివం దుబే, రింకు సింగ్, అక్షర్ పటేల్ వంటి డేంజరస్ ప్లేయర్లు ఉన్నారు. వీరు మ్యాచ్‌ను ఏ క్షణంలోనైనా మలుపు తిప్పేస్తారు.

అలాగే, బౌలింగ్ విషయానికి వస్తే.. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లతో పాటు మిస్టరీ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌లు ఉన్నారు. మహ్మద్ సిరాజ్ జట్టుకు గట్టి మద్దతు ఇవ్వనున్నారు.

మ్యాచ్ కు ముందు హర్షిత్ రాణా గాయం కారణంగా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. హర్షిత్ స్థానంలో సిరాజ్ జట్టుతో చేరాడు. గత కొన్ని సిరీస్‌లలో, భారత బ్యాట్స్‌మెన్స్ పేసర్ల కంటే స్పిన్నర్లపై ఎక్కువ ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. స్పిన్నర్లపై చాలా తక్కువ స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నారు. ఈ క్రమంలో అమెరికన్ స్పిన్నర్లు సమస్యలను సృష్టించవచ్చు.

ఈ ఆటగాళ్లపై ఓ లుక్ వేయండి..

  • టీమిండియా తోపు ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20ఐల్లో 1297 పరుగులు చేయగా, అర్ష్‌దీప్ టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
  • 2024 నుంచి భారతదేశపు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. 38 మ్యాచ్‌ల్లో 194.74 స్ట్రైక్ రేట్‌తో 1297 పరుగులు చేశాడు. అర్ష్‌దీప్ సింగ్ 34 మ్యాచ్‌ల్లో 59 వికెట్లు పడగొట్టాడు.
  • ఇక అమెరికా తరపున గౌస్ అత్యధిక పరుగులు సాధించగా, హర్మీత్ అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్.
  • ఆండ్రీస్ గౌస్ అమెరికా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. 2024 నుంచి 25 మ్యాచ్‌ల్లో 752 పరుగులు చేశాడు. 81 అత్యుత్తమ స్కోరుగా నిలిచింది. హర్మీత్ సింగ్ 25 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టి, అమెరికా జట్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

పిచ్, వాతావరణం..

ఈరోజు ముంబైలో వర్షం పడే ఛాన్స్ లేదు. ఉష్ణోగ్రత 30-35 డిగ్రీల సెల్సియస్ ఉండనుంది. మంచు కారణంగా వాంఖడే పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభ ఓవర్లలో పేసర్లకు అనుకూలంగా ఉండనుంది. ఈ మైదానంలో ఛేజింగ్ సులభం అవుతుంది. కాబట్టి, టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకుంటుంది.

ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

భారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

యూఎస్ఏ: సాయితేజ ముక్కామల, ఆండ్రీస్ గౌస్, షయాన్ జహంగీర్, మోనాంక్ పటేల్ (కెప్టెన్), మిలింద్ కుమార్, హర్మీత్ సింగ్, శుభమ్ రంజానే, మహ్మద్ మొహ్సిన్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, అలీ ఖాన్, సౌరభ్ నేత్రవల్కర్.

ఈ మ్యాచ్‌ను ఎక్కడ చూడవచ్చు..?

ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్‌లో చూడొచ్చు. అలాగే, జియో హాట్‌స్టార్‌లో కూడా చూడొచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us