AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయం మంచి బ్రేక్‌ఫాస్ట్ ఏది? ఆరోగ్యకరమైన రోజుకు బలమైన ఆరంభం ఇదే..!

Healthy breakfast: సమతుల్య పోషకాలు ఉన్న బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే నిజమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. మంచి బ్రేక్‌ఫాస్ట్‌లో ఉండాల్సిన ముఖ్యమైన పోషకాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ఆదర్శ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ నాలుగు తప్పనిసరిగా ఉండాలి. కార్బోహైడ్రేట్లు – శక్తి కోసం, ప్రోటీన్లు – కండరాల బలం, దీర్ఘకాల తృప్తి కోసం ఫైబర్ – జీర్ణక్రియ, షుగర్ నియంత్రణ కోసం ఆరోగ్యకరమైన కొవ్వులు – హార్మోన్ల సమతుల్యం కోసం తప్పనిసరి.

ఉదయం మంచి బ్రేక్‌ఫాస్ట్ ఏది? ఆరోగ్యకరమైన రోజుకు బలమైన ఆరంభం ఇదే..!
best breakfast
Rajashekher G
|

Updated on: Feb 07, 2026 | 8:19 AM

Share

ఉదయం తినే బ్రేక్‌ఫాస్ట్ మన శరీరానికి ఇంధనం లాంటిది. రాత్రంతా ఉపవాసంలో ఉన్న శరీరానికి కావాల్సిన శక్తిని అందించి, మెదడు పనితీరును చురుకుగా ఉంచడంలో బ్రేక్‌ఫాస్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే “ఏది తిన్నా సరిపోతుందా?” అంటే కాదు. సమతుల్య పోషకాలు ఉన్న బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే నిజమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. మంచి బ్రేక్‌ఫాస్ట్‌లో ఉండాల్సిన ముఖ్యమైన పోషకాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ఆదర్శ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ నాలుగు తప్పనిసరిగా ఉండాలి. కార్బోహైడ్రేట్లు – శక్తి కోసం, ప్రోటీన్లు – కండరాల బలం, దీర్ఘకాల తృప్తి కోసం ఫైబర్ – జీర్ణక్రియ, షుగర్ నియంత్రణ కోసం ఆరోగ్యకరమైన కొవ్వులు – హార్మోన్ల సమతుల్యం కోసం తప్పనిసరి.

ఆరోగ్యానికి ఉత్తమమైన బ్రేక్‌ఫాస్ట్

1. ఇడ్లీ / దోసె + సాంబార్

ఫెర్మెంటెడ్ ఆహారం కావడంతో జీర్ణక్రియకు మంచిది సాంబార్‌లో కూరగాయలు, పప్పులు ఉండటం వల్ల ప్రోటీన్, ఫైబర్ లభిస్తాయి

2. ఓట్స్ ఉప్మా / ఓట్స్ పోరిడ్జ్

ఫైబర్ అధికంగా ఉండి కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. షుగర్ ఉన్నవారికి మంచి ఎంపిక.

3. రాగి జావ / రాగి దోసె

కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం.

4. గుడ్లు (ఉడికించినవి)

హై క్వాలిటీ ప్రోటీన్. బరువు తగ్గాలనుకునేవారికి సరైన ఆహారం.

5. పండ్లు + నట్స్

పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. తేలికగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ కావాలనుకునేవారికి మంచిది.

బ్రేక్‌ఫాస్ట్‌లో ఉండకూడదనవి..

అధిక చక్కెర ఉన్న ఆహారాలు బేకరీ ఐటెమ్స్ (పఫ్‌లు, క్రీమ్ బన్స్) డీప్ ఫ్రైడ్ స్నాక్స్ కేవలం టీ లేదా కాఫీతో బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం ఇవి తాత్కాలికంగా శక్తినిచ్చినా, దీర్ఘకాలంలో అలసట, బరువు పెరుగుదలకు కారణమవుతాయి.

బ్రేక్‌ఫాస్ట్ తినే సరైన సమయం

ఉదయం లేచిన 1–2 గంటల్లోపు బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం ఉత్తమం. ఇది మెటబాలిజాన్ని యాక్టివ్ చేసి రోజంతా శక్తిని నిలబెడుతుంది.

పోషక నిపుణుల ప్రకారం.. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల షుగర్ లెవల్స్ అసమతుల్యం అవుతాయి, అలాగే ఎక్కువగా తినే అలవాటు పెరుగుతుంది. రోజు ఎలా ప్రారంభమవుతుందో, రోజు అంతా అలాగే సాగుతుంది. కాబట్టి మీ జీవనశైలి, వయసు, ఆరోగ్య స్థితికి తగ్గట్టు బ్రేక్‌ఫాస్ట్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మంచి బ్రేక్ ఫాస్ట్ మంచి ఆరోగ్యానికి సంకేతమంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఉదయం మంచి బ్రేక్‌ఫాస్ట్ ఏది? ఆరోగ్యకరమైన రోజుకు బలమైన ఆరంభం ఇదే..
ఉదయం మంచి బ్రేక్‌ఫాస్ట్ ఏది? ఆరోగ్యకరమైన రోజుకు బలమైన ఆరంభం ఇదే..
పాడి రైతులు ఈ విషయం తెలుసుకోండి..
పాడి రైతులు ఈ విషయం తెలుసుకోండి..
శ్రీ హనుమాన్ తాండవ స్తోత్రం పఠిస్తే ఎన్ని లాభాలో తెలుసా..?
శ్రీ హనుమాన్ తాండవ స్తోత్రం పఠిస్తే ఎన్ని లాభాలో తెలుసా..?
ఇవి గుండెకు దివ్యౌషధం.. రోజుకు ఒకటి రెండు తింటే గుండెపోటుకు చెక్‌
ఇవి గుండెకు దివ్యౌషధం.. రోజుకు ఒకటి రెండు తింటే గుండెపోటుకు చెక్‌
'నా నడుముపై చేయి వేసి'.. బిగ్ బాస్ తెలుగు బ్యూటీకి చేదు అనుభవం
'నా నడుముపై చేయి వేసి'.. బిగ్ బాస్ తెలుగు బ్యూటీకి చేదు అనుభవం
షుగ‌ర్ ఉన్న‌వారు సపోటా తింటే ఏమౌతుందో తెలుసా? డాక్టర్స్‌ చెప్పేది
షుగ‌ర్ ఉన్న‌వారు సపోటా తింటే ఏమౌతుందో తెలుసా? డాక్టర్స్‌ చెప్పేది
అరటి పండు Vs జామ పండు: ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
అరటి పండు Vs జామ పండు: ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
ఇన్నాళ్లు తమ పొట్ట నింపిన తాటి చెట్టు పైనుంచే.. అనంత లోకాలకు
ఇన్నాళ్లు తమ పొట్ట నింపిన తాటి చెట్టు పైనుంచే.. అనంత లోకాలకు
తొలి మ్యాచ్‌కు ముందే దిమ్మతిరిగే షాక్.. ఆడకుండానే పాక్ ఔట్..?
తొలి మ్యాచ్‌కు ముందే దిమ్మతిరిగే షాక్.. ఆడకుండానే పాక్ ఔట్..?
జియో హాట్ స్టార్‌ను వదలని ప్రభాస్ ఫ్యాన్స్..!
జియో హాట్ స్టార్‌ను వదలని ప్రభాస్ ఫ్యాన్స్..!