AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cattle: ఆవు కడుపు నుంచి ప్లాస్టిక్ తీస్తున్నారు అనుకునేరు.. అసలు విషయం వేరే…

ఈ ఫోటో చూసి “ఆవు కడుపు నుంచి ప్లాస్టిక్ తీస్తున్నారు” అని అనుకుంటే పొరపాటే. కానీ నిజం అది కాదు. ఆవు ఈనిన తర్వాత గర్భాశయంలో చీలికల వల్ల తీవ్ర రక్తస్రావం జరగడంతో, డాక్టర్ వచ్చేలోపు ప్రాణాలు కాపాడేందుకు రైతు తాత్కాలికంగా శుభ్రమైన చీరను లోపల ఉంచాడు. తర్వాత పశువైద్యుడు వచ్చి దాన్ని సురక్షితంగా తీసి, గర్భాశయాన్ని శుభ్రం చేసి, రక్తస్రావం ఆపేందుకు ఇంజెక్షన్ ఇచ్చారు.

Cattle: ఆవు కడుపు నుంచి ప్లాస్టిక్ తీస్తున్నారు అనుకునేరు.. అసలు విషయం వేరే...
Post Calving Complications
Ram Naramaneni
|

Updated on: Feb 07, 2026 | 8:11 AM

Share

ఈ ఫోటో చూసి ఆవు కడుపు నుంచి ప్లాస్టిక్ తీస్తున్నారు అనుకునేరు. కానీ అక్కడ జరుగుతున్నది వేరు. వాస్తవానికి, కొన్నిసార్లు ఆవులు ఈనిన తర్వాత గర్భాశయంలో చీలికలు ఏర్పడి తీవ్ర రక్తస్రావం జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకర పరిస్థితి. ఇటువంటి సందర్భంలో రైతు తక్షణ చర్యగా రక్తాన్ని ఆపడానికి చీరను అడ్డుగా లోపల ఉంచాడు. డాక్టర్లు వచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి.. ఈ లోపులో గోవుకు ఏం కాకుండా పాడి రైతులు ఇలా చేస్తారు. తరువాత, పశువైద్యుడు వచ్చి గర్భాశయం లోపల ఉన్న చీరను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం, గర్భాశయాన్ని పూర్తిగా శుభ్రం చేసి, రక్తస్రావాన్ని అరికట్టడానికి టెక్సా బ్లీడ్ అనే ఇంజెక్షన్ ఇచ్చారు. రక్తస్రావాన్ని నియంత్రించడానికి ఈ ఇంజెక్షన్ సమర్థవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా, గర్భాశయం దాని సాధారణ స్థితికి తిరిగి రావడానికి (యుటరైన్ ఇన్వల్యూషన్), ఆస్కాల్ జెల్ వంటి కాల్షియం సప్లిమెంట్లను ఆవుకు అందించడం చాలా అవసరం. ఈ ప్రక్రియ ఆవు త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.

రక్తస్రావం కాకుండా చీర అడ్డు పెట్టడం అనేది డాక్టర్ ట్రీట్మెంట్ కాదు.. తాత్కాలికంగా రక్తస్రావం ఆపడానికి చేసే ఎమర్జెన్సీ చర్య. చీర అంటే కొందరు ఏదైనా పాత చీరా అని అనుకుంటారు. శుభ్రంగా కడిగిన చీర అయితే ఆ ఆవుకు ఎలాంటి ఇన్‌ఫెక్షన్స్ సోకకుండా ఉంటాయి. ఇది తాత్కాలికంగా ప్రాణాలు కాపాడే ఫస్ట్-ఎయిడ్ మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి.