AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hebah Patel : తెలుగులో నా ఫేవరేట్ హీరో ఆయనే.. ఒక్క ఛాన్స్ వస్తే అస్సలు వదిలిపెట్టను.. హెబ్బా పటేల్ కామెంట్స్..

సినీరంగంలో కథానాయికగా అడుగుపెట్టినప్పటికీ సరైన క్రేజ్ రావడం అంత సులభమేమి కాదు. అంతేకాదు వరుస సినిమాలతో మెప్పించినప్పటికీ స్టార్డమ్ అందుకున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో హెబ్బా పటేల్ ఒకరు. గ్లామర్ పాత్రలు కాకుండా విభిన్నమైన కంటెంట్ కథలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేసింది ఈ ముద్దుగుమ్మ. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన ఫేవరేట్ హీరో గురించి చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

Rajitha Chanti
|

Updated on: May 19, 2026 | 4:26 PM

Share
హెబ్బా పటేల్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కన్నడ చిత్రం 'అధ్యక్ష' (2014) ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. అదే ఏడాది 'అలా ఎలా' సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. సుకుమార్ కథ అందించిన 'కుమారి 21F' (2015) సినిమా హెబ్బా కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ చిత్రంలో ఆమె నటన, బోల్డ్ క్యారెక్టరైజేషన్ యూత్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. రాత్రికి రాత్రే ఆమె స్టార్ సెలబ్రిటీగా మారిపోయారు. 'ఈడో రకం ఆడో రకం', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'అంధగాడు', 'మిస్టర్' వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి.

1 / 5
కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, హెబ్బా పటేల్ డిఫరెంట్ జోనర్స్‌ను కూడా ట్రై చేశారు. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ఆమె ఓటీటీ (OTT) ప్లాట్‌ఫార్మ్స్ వైపు కూడా అడుగులు వేశారు. 'మస్తీస్' (ZEE5), 'వ్యవస్థ' (ZEE5) వంటి వెబ్ సిరీస్‌లలో కీలక పాత్రలు పోషించి మెప్పించారు. రామ్ పోతినేని నటించిన 'రెడ్' సినిమాలో "దింతక దింతక" సాంగ్‌లో స్పెషల్ అప్పీరెన్స్‌తో మాస్ ఆడియన్స్‌ను అలరించారు. ఇటీవలే ఓదెల రైల్వే స్టేషన్ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ఇష్టమైన హీరో గురించి వెల్లడించింది. అంతేకాదు అతడితో ఛాన్స్ వస్తే నటించేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపింది.

2 / 5
ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ యాక్టర్ గురించి అడిగిన ప్రశ్నకు హెబ్బా పటేల్ ఏమాత్రం తడుముకోకుండా జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పారు. తారక్ నటన, ఆయన పర్సనాలిటీ అంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. 'కుమారి 21F' సినిమా టీజర్ లాంచ్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చినప్పటి నుండి ఆయనపై తనకు ప్రత్యేకమైన అభిమానం ఏర్పడిందని హెబ్బా గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ సినిమాతో నటించే అవకాశం వస్తే ఎలాంటి పాత్రకైనా సిద్ధమేనని హెబ్బా పటేల్ స్పష్టం చేశారు.

3 / 5
"ఆయన సినిమాలో నాకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా, కథలో ఇంపార్టెంట్ లేకపోయినా పర్వాలేదు. కనీసం నన్ను వెనుక బ్యాక్‌గ్రౌండ్‌లో నిలబెట్టినా నేను ఆ పాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే కొన్నిసార్లు కెరీర్ బ్రేకింగ్ పాత్రల కంటే, మనకున్న బలమైన కోరికలను తీర్చుకోవడం ముఖ్యం" అంటూ తారక్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు కమెడియన్ సునీల్ చాలా స్వీట్, కేరింగ్ పర్సన్ అని అన్నారు. తన కెరీర్‌లో అత్యంత కంఫర్టబుల్ కోస్టార్ రాజ్ తరుణ్ అని చెప్పారు. ఆయనతో ఎక్కువ సినిమాలు చేయడం వల్ల ఆ బాండింగ్ ఏర్పడిందని, అయితే ఇద్దరం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసాం కాబట్టి కొంతకాలం కలిసి నటించకపోవడమే మంచిదని నవ్వుతూ అన్నారు

4 / 5
అలాగే తన కెరీర్‌లో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', '24 కిస్సెస్' చిత్రాల్లో తన నటన తనకు బాగా నచ్చిందని తెలిపారు. ప్రస్తుతానికి తాను పూర్తిగా సింగిల్‌గానే ఉన్నానని హెబ్బా క్లారిటీ ఇచ్చారు. ముంబై (మహారాష్ట్ర) లో జన్మించిన హెబ్బా పటేల్, అక్కడే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో హెబ్బా పటేల్ చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన గ్లామరస్ ఫోటోషూట్స్, ట్రావెల్ అప్‌డేట్స్‌తో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను అలరిస్తుంటారు. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన ప్రతి పోస్ట్ క్షణాల్లో నెట్టింట వైరలవుతుంది. ప్రస్తుతం ఆమె కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తుంది.

5 / 5
Follow Us