500 బ్రెడ్‌లతో భారీ డ్రెస్.. బేకరీ ప్రమోషన్ కోసం నటి వినూత్న ప్రయోగం
నైజీరియాలో జరిగిన అవార్డుల వేడుకలో రియాలిటీ స్టార్ క్వీన్ మెర్సీ 500 బ్రెడ్లతో తయారు చేసిన ప్రత్యేక గౌనుతో అందరి దృష్టిని ఆకర్షించింది. తన బేకరీ వ్యాపారాన్ని ప్రమోట్ చేయడానికే ఈ వినూత్న డ్రెస్ ధరించినట్లు ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ఈ ‘బ్రెడ్ డ్రెస్’ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ప్రయోగాలు చూస్తుంటాం. కానీ, నైజీరియాలో జరిగిన ఒక అవార్డుల ప్రదానోత్సవంలో ఒక నటి వేసుకొచ్చిన డ్రెస్ అందరూ షాకయ్యేలా చేసింది. ఏకంగా 500 బ్రెడ్లతో తయారు చేసిన గౌనును ధరించి రెడ్ కార్పెట్‌పై నడిచి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది రియాలిటీ టీవీ స్టార్ ‘క్వీన్ మెర్సీ’. ‘ఆఫ్రికా మ్యాజిక్ వ్యూయర్స్ ఛాయిస్ అవార్డ్స్’ వేడుకలు లాగోస్ లోని ఓ హోటల్ లో జరిగాయి. సినీ ప్రముఖులు, క్రియేటర్లు ఎవరికి వారు వినూత్నంగా, ఆకర్షణీయంగా వేడుకకు హాజరయ్యారు. అయితే వాటన్నింటిలో క్వీన్ మెర్సీ అటాంగ్ ధరించిన ‘బ్రెడ్ డ్రెస్’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్వీన్ మెర్సీ రెడ్ కార్పెట్ మీదకు వస్తున్నప్పుడు ఇద్దరు మహిళలు బ్రెడ్లను పట్టుకుని ఆమెకు రెండు వైపులా నడిచారు. భారీగా ఉన్న ఆ డ్రెస్‌తో ఆమె సులభంగా నడవలేకపోవడంతో, దానిని మోయడానికి పలువురు సహాయకులు కూడా ఆమె వెంట నడిచారు. ఇంతకీ ఆమె ఆ వింత డ్రెస్ ఎందుకు ధరించారంటే.. తన బేకరీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవడం కోసమే. తన బిజినెస్‌ను ప్రమోట్ చేసుకోవడానికి ఇంతకంటే మంచి వేదిక ఏముంటుంది? అని ఆమె అన్నారు. అందరి దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో కాకుండా, కావాలనే పక్కా ప్లానింగ్‌తో తన బ్రాండ్ మార్కెటింగ్ కోసం ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ బ్రెడ్ డ్రెస్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈసారి మెటా గాలా ఈవెంట్‌కు.. భారత్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కూతురు, రిలయన్స్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ సహా ప్రముఖ వ్యాపారవేత్త కుమార మంగళం బిర్లా కూతురు గాయని, వ్యాపారవేత్త అయిన అనన్య బిర్లా కూడా హాజరయ్యారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు
ఉద్యోగమే మీ గుర్తింపు కాదు.. మహిళ వీడియో వైరల్
అతను హీరో.. నెట్టింట పొగడ్తలు.. ఏం చేశాడంటే..
కోమా నుంచి మేల్కొన్న యువతి.. లేని పిల్లల కోసం ఆరాటం
బేకరీ ప్రమోషన్ కోసం నటి వినూత్న ప్రయోగం

