అతను హీరో.. నెట్టింట పొగడ్తలు.. ఏం చేశాడంటే..
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఓ ఇండోనేషియా యువతి దుపట్టా పట్టాల మధ్య పడిపోవడంతో, అటుగా వెళ్తున్న వ్యక్తి ఏమాత్రం ఆలోచించకుండా ట్రాక్‌పైకి దూకి తీసి ఇచ్చాడు. సహాయం చేసిన తర్వాత కృతజ్ఞతలు కూడా తీసుకోకుండా నిశ్శబ్దంగా వెళ్లిపోవడం నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ హృదయాన్ని హత్తుకునే వీడియో సోషల్ మీడియాలో కోట్లాది వ్యూస్‌తో వైరల్ అవుతోంది.
ప్రస్తుత సమాజంలో ప్రతిఫలం ఆశించకుండా సాయం చేసేవారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి ఓ మంచి మనసున్న ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి హృదయాలను గెలుచుకుంటోంది. ఓ ఇండోనేషియా యువతికి సహాయం చేసేందుకు ఆయన ఏమాత్రం ఆలోచించకుండా రైల్వే ట్రాక్‌పైకి దూకాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇండోనేషియా డిజిటల్ క్రియేటర్ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలు డోర్ వద్ద నిల్చుని ఉంది. ఆమె కెమెరాను సర్దుకుంటుండగా తన దుపట్టా రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఉన్న ఖాళీలో పడిపోయింది. ఆమె ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉండగానే, అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వెంటనే స్పందించారు. మొదట చేత్తో తీయడానికి ప్రయత్నించినా దుపట్టా అందలేదు. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్రాక్‌పైకి దూకి, దుపట్టాను తీసి ఆ యువతికి అందించాడు. ఆ తర్వాత ఆమె సాయం చేయబోయినా సున్నితంగా తిరస్కరించి, ప్లాట్‌ఫామ్‌పైకి ఎక్కాడు. కనీసం ఆమె చెప్పే కృతజ్ఞతల కోసం కూడా ఆగకుండా తన దారిన తాను నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు. ఊహించని సహాయానికి ఆశ్చర్యపోయిన ఆ యువతి ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఆయన ట్రాక్‌పైకి దూకుతారని అస్సలు ఊహించలేదరీ. నిజాయితీగా చెప్పాలంటే తనకు చాలా బాధగా అనిపించిందనీ రాసుకొచ్చింది. వీడియోకు ఇప్పటికే 41 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు ఆ వ్యక్తి మంచితనాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. “ఆయన ఒక హీరోలా నడిచి వెళ్లారు”, “ఆ యువతి చేతిని సాయం కోసం కూడా పట్టుకోలేదు, అతనే నిజమైన జెంటిల్‌మన్” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సముద్రం అడుగున పైప్‌లైన్.. గ్యాస్ కష్టాలకు చెక్ పడేనా
కోమా నుంచి మేల్కొన్న యువతి.. లేని పిల్లల కోసం ఆరాటం
500 బ్రెడ్‌లతో భారీ డ్రెస్.. బేకరీ ప్రమోషన్ కోసం నటి వినూత్న ప్రయోగం
అతను హీరో.. నెట్టింట పొగడ్తలు.. ఏం చేశాడంటే..
కోమా నుంచి మేల్కొన్న యువతి.. లేని పిల్లల కోసం ఆరాటం
బేకరీ ప్రమోషన్ కోసం నటి వినూత్న ప్రయోగం
అరుదైన దృశ్యం.. ఒకే చోట మూడు పాముల 'సయ్యాట'
సముద్రం అడుగున ప్రపంచంలోనే.. అతిపెద్ద జలపాతం
కొన్ని దేశాల్లో పాములు ఎందుకు ఉండవు ??
కింద పడ్డ మామిడికాయలు ఏరుకుంటే.. అంత పెద్ద శిక్షా?

