Chandrababu: పల్నాడు హత్యలపై టీడీపీ చీఫ్ చంద్రబాబు సీరియస్.. చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి లేఖ

వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి పల్నాడు ప్రాంతంలో పరిస్థితి పూర్తి అదుపుతప్పిందని.. హత్యా రాజకీయాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తంచేశారు.

Chandrababu: పల్నాడు హత్యలపై టీడీపీ చీఫ్ చంద్రబాబు సీరియస్.. చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి లేఖ
Chandrababu Naidu
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 04, 2022 | 8:21 AM

Chandrababu letter to AP DGP: పల్నాడు హత్యా రాజకీయాలపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. పల్నాడు జిల్లా జంగమేశ్వరపాడులో టీడీపీ కార్యకర్త కంచర్ల జల్లయ్య హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కోరారు. వైఎస్సార్‌సీపీ అనుకూల పోలీసు అధికారుల తీరుతో పల్నాడులో శాంతి భద్రతలు గాడి తప్పాయంటూ పేర్కొన్నారు. 2019లో వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి పల్నాడు ప్రాంతంలో పరిస్థితి పూర్తి అదుపుతప్పిందని.. హత్యా రాజకీయాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పల్నాడు ప్రాంతంలో దళితులు, బీసీలు, మైనారిటీలపై దాడులు పెరిగాయన్నారు. 2019 ఎన్నికల తరువాత వైసీపీ కార్యకర్తల దాడుల భయంలో వేరే ప్రాంతంలో ఉంటున్న జల్లయ్య శుభకార్యంలో పాల్గొనేందుకు వస్తే దారుణంగా చంపేశారన్నారు. ఈ దాడిలో జల్లయ్య ప్రాణాలు కోల్పోగా.. బక్కయ్య, ఎల్లయ్య ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారని వివరించారు.

కొద్ది నెలల క్రితం జరిగిన తోట చంద్రయ్య హత్య సమయంలోనే పల్నాడులో పరిస్థితులపై పోలీసుల దృష్టికి తెచ్చినా ఫలితం లేకుండా పోయిందని చంద్రబాబు లేఖలో వివరించారు. గతంలో టీడీపీ కార్యకర్తల అక్రమ నిర్బంధంలో స్వయంగా స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమేయం ఉన్నట్లు కూడా తేలిందన్నారు. పల్నాడులో జరుగుతున్న వరుస ఘటనలు చూస్తే ఇక్కడి పోలీసులు విధి నిర్వహణలో విఫలం అవుతున్నారని అర్థం అవుతుంద్నారు. లా అండ్ ఆర్డర్‌ను గాలికి వదిలేసి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అనుకూలంగా ఉండే పోలీసు అధికారుల నియామకం కారణంగా పల్నాడులో పరిస్థితులు గాడి తప్పుతున్నాయని చంద్రబాబు లేఖలో వివరించారు. పల్నాడులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డీజీపీని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?