Crime News: ఇలా చేశావేంటమ్మా..? ఏడుస్తున్నారని ఇద్దరు పిల్లలను గొంతునులిమి చంపేసింది.. ఆ తర్వాత..

30 ఏళ్ల మహిళ ఏడుస్తున్నారనే కారణంతో పసికందుతో సహా రెండేళ్ల కొడుకును గొంతు నులిమి హత్య చేసి, ఆపై వారి మృతదేహాలను కాల్చివేసినట్లు నాందేడ్ పోలీసులు శుక్రవారం తెలిపారు.

Crime News: ఇలా చేశావేంటమ్మా..? ఏడుస్తున్నారని ఇద్దరు పిల్లలను గొంతునులిమి చంపేసింది.. ఆ తర్వాత..
Child Death
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 04, 2022 | 7:38 AM

Woman Kills Daughter and Son: మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది.. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఇద్దరు బిడ్డలను కన్న తల్లే కడతేర్చింది.. ఏడుస్తున్నారనే కారణంతో ఇద్దరిని చంపి వారి మృతదేహాలను కాల్చివేసింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో చోటుచేసుకుంది. 30 ఏళ్ల మహిళ ఏడుస్తున్నారనే కారణంతో పసికందుతో సహా రెండేళ్ల కొడుకును గొంతు నులిమి హత్య చేసి, ఆపై వారి మృతదేహాలను కాల్చివేసినట్లు నాందేడ్ పోలీసులు శుక్రవారం తెలిపారు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరినీ చంపినట్లు పోలీసులు తెలిపారు. నాందేడ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

భోకర్‌లోని పాండుర్నా గ్రామానికి చెందిన దుర్పదాబాయి గణపత్ నిమల్‌వాడ్‌ అనే మహిళకు రెండేళ్ల కుమారుడు దత్తా, నాలుగు నెలల చిన్నారి అనసూయ ఉంది. అయితే.. పిల్లలిద్దరూ ఆపకుండా ఏడుస్తుండటంతో ఆమె అసహనానికి గురైంది. ఈ క్రమంలో మే 31న నాలుగు నెలల చిన్నారి అనసూయ గొంతు నులిమి చంపేసింది. అనంతరం మరుసటి రోజు (జూన్‌ 1న) బుధవారం ఆకలి అంటూ ఏడ్చిన కుమారుడినీ సైతం గొంతునులిపి హత్య చేసింది.

అనంతరం.. ముఖేడ్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న తల్లి కొండాబాయి రాజేమోద్, సోదరుడు మాధవ్ రాజేమోద్‌కు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో వారు ఇంటికి వచ్చారు. అనంతరం నిందితురాలి ఇద్దరి సాయంతో చిన్నారుల మృతదేహాలను సమీపంలోని పొలానికి తీసికెళ్లి కాల్చేసినట్లు నిందితురాలు పోలీసులకు తెలిపింది.

ఇవి కూడా చదవండి

సమాచారం అందుకున్న పోలీసులు పిల్లల చంపిన నిందితురాలు ధుర్పదబాయి గణపత్ నిమల్వాడ్‌తో పాటు ఆమె తల్లి, సోదరుడిని గురువారం అరెస్టు చేసినట్లు భోకర్ పోలీస్ స్టేషన్ అధికారి వెల్లడించారు. వారిని కోర్డులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..