AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: బాలిక రేప్ ఘటనపై ఘాటుగా స్పందించిన ఆనంద్‌ మహీంద్ర.. అలా అనడం సరికాదంటూ..

హైదరాబాద్‌లో బాలికపై ‘పలుకుబడి’ ఉన్న కుటుంబాల యువకులు అత్యాచారానికి పాల్పడ్డారన్న వార్తలపై ఘాటుగా స్పందించారు మహీంద్రా గ్రూపు చైర్‌పర్సన్‌ ఆనంద్‌ మహీంద్రా.

Hyderabad: బాలిక రేప్ ఘటనపై ఘాటుగా స్పందించిన ఆనంద్‌ మహీంద్ర.. అలా అనడం సరికాదంటూ..
Anand Mahindra
Jyothi Gadda
|

Updated on: Jun 04, 2022 | 7:38 AM

Share

హైదరాబాద్ నగరం జూబ్లీహిల్స్‌ పరిధిలో జరిగిన మైనర్ బాలికపై అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది.  పబ్‌కు వెళ్లిన యువతి (17)పై కొందరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. సంచలనంగా మారిన ఈ రేప్ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితులను శికించే పనిలోపడ్డారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసినట్టు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇకపోతే ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు  ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్ర..హైదరాబాద్‌లో బాలికపై ‘పలుకుబడి’ ఉన్న కుటుంబాల యువకులు అత్యాచారానికి పాల్పడ్డారన్న వార్తలపై ఘాటుగా స్పందించారు మహీంద్రా గ్రూపు చైర్‌పర్సన్‌ ఆనంద్‌ మహీంద్రా. ‘‘ఆ యువకులు ఎవరో నాకు తెలియదు. కానీ వార్తల్లో వారిని ఉద్దేశించిన ప్రస్తావన సరికాదని నా అభిప్రాయం. ఆ యువకులు ‘పలుకుబడి’ ఉన్న కుటుంబాల వారు కాదు.. సంస్కృతి, మానవతా విలువలు లేని, సరైన పెంపకం తెలియని ‘దిగువ స్థాయి’ కుటుంబాల వారు అనడం సరైనది. బాలికకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను..అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

మరోవైపు వెస్ట్‌ జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌ ఈ కేసుకు సంబంధించిన వివరాలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇద్దరిలో వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ మసీవుల్లాఖాన్‌ కొడుకు ఖాదర్‌ఖాన్‌, ఈయన ఫ్రెండ్‌ హాది అని అన్నారు. ఈ ఘటన మే 28న జరుగగా, మే 31న లైంగిక దాడి జరిగిందని బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు చేపట్టామని, తనపై అఘాయిత్యానికి పాల్పడింది ఎవరో బాధితురాలు చెప్పలేకపోయిందని, ఒక్కరి పేరు మాత్రమే ఆమె చెప్పగలిగిందని అన్నారు. సీసీపుటేజీ, టెక్నికల్‌ ఆధారాలను సేకరించాం. బాధితురాలు చెప్పిన విషయాన్ని, ఆధారాలను క్రాస్‌ చెక్‌ చేస్తున్నామని డీసీపీ అన్నారు. తమ విచారణలో ఐదుగురు నిందితులను గుర్తించామని పేర్కొన్నారు.